District collector : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..!
District collector : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..!
మల్లాపూర్, (మన సాక్షి)
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపెట్ కుస్తాపూర్ గ్రామంలో గురువారం పాక్స్,ఐకేపీ సెంటర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రమును జిల్లా కలెక్టర్బి సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ ధాన్యం ఎంత మొత్తంలో వస్తుంది, ధాన్యానికి సంబంధించిన తేమ ఏవిధంగా ఉందని పరిశీలించారు. అలాగే ధాన్యాన్ని తీసుకొని దాని మ్యాచర్ ఏ విధంగా ఉంది అని తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ధాన్యం ఎంత వరకు కొనుగోలు చేశారు. ఇంకా ఎంతవరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని. తేమ వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అలాగే సన్నం రకం ధాన్యాన్ని కి ప్రభుత్వం ఇస్తున్న 500 బోనస్ ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు ఎప్పటికప్పుడు వారి ఖాతాలు బోనస్ ని జమ చేయాలని. అలాగే మిగతా రైతులకు ప్రభుత్వ సెంటర్ల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసేలా అవగాహన కల్పించాలని అన్నారు.
ఎప్పటికప్పుడు ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ వేగవంతంగా రైస్ మిల్లులకు తరలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ శ్రీనివాస్, డిఆర్డిఓ రఘు వరుణ్,ఎమ్మార్వో వీర్ సింగ్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
MOST READ :









