పంటను కాపాడుకునేందుకు అన్నదాత కష్టాలు..!
పంటను కాపాడుకునేందుకు అన్నదాత కష్టాలు..!
నిజామాబాద్ (భీంగల్) మన సాక్షి
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం సికింద్రాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతుకు రెండెకరాల భూమి ఉంది. సెనగ, కొత్తిమీర, బీరకాయ పంటలను సాగు చేస్తున్నారు. పాత బోరు నుంచి నీళ్లు రాకపోవడంతో కొత్తగా బోరు వేసేందుకు వాహనం తెప్పించారు.
రైతు వరి పంటకు తడులు అందించడానికి బోరు వేశారు. 400 అడుగులు తవ్వినా చుక్క నీరు పడలేదు.
రూ.60 వేలకు పైగా ఖర్చయ్యాయి. ఎండలు దంచికొడుతున్నాయి. పంటలకు నీరు ఎక్కువగా అవసరమవుతోంది. రైతులు బోరు మోటార్లను 24 గంటల పాటు నడిపిస్తున్నారు. భూగర్భ జలాలు ఇంకి పోతున్నాయి. పంటలను కాపాడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నఫళంగా ఖర్చు చేసి కొత్త బోర్లు వేస్తున్నా నీరు పడటం లేదు.
గతంలో బోర్లు తవ్వే సమయంలో 60-100 అడుగుల్లో నీళ్లు పడేవి. ప్రస్తుతం 400 అడుగులు దాటినా నీటి జాడ లేదు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నీరు అందక పంట పడుతుందో లేదోనని కర్షకులు ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జల వనరుల శాఖ నివేదిక ప్రకారం నీరు పైపైన ఉన్నట్టుగా గణాంకాలు చూపుతున్నా.. బోరుబావుల్లో నీటి జాడ అంత పైన లేదు.
MOST READ :
-
Suryapet : సూర్యాపేట జిల్లాలో దారుణం.. స్నేహితురాలిని ఇంటికి పిలిపించిన యువతి.. అత్యాచారం, ఫోటోలు, వీడియోలతో బెదిరింపు..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ లావాదేవీలకు కేంద్రం గుడ్ న్యూస్..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై భారీ గుడ్ న్యూస్.. నిధుల కేటాయింపు..!
-
Telangana Budget 2025 : తెలంగాణ బడ్జెట్ లో సామాన్యులకు భారీ గుడ్ న్యూస్..!
-
District collector : మఖాన సాగు పై రైతులు దృష్టి సారించాలి.. వ్యవసాయ శాస్త్రవేత్తలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్..!









