Dubbaka : అదుపుతప్పి లారీ బోల్తా.. డ్రైవర్ అక్కడికక్కడే మృతి..!

అదుపుతప్పి లారీ బోల్తా పడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది.

Dubbaka : అదుపుతప్పి లారీ బోల్తా.. డ్రైవర్ అక్కడికక్కడే మృతి..!

దుబ్బాక, మనసాక్షి :.

అదుపుతప్పి లారీ బోల్తా పడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్సై గంగరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

హెచ్ఎంటి స్టీల్ ( ఐరన్ ) లోడ్ చేసుకొని ఎపి 29టిఏ 7447 ఓపెన్ లారీ రామాయంపేట వైపు నుండి సిద్దిపేట వైపు వెళ్తున్న క్రమంలో నిర్మాణంలో ఉన్న రోడ్డును డ్రైవర్ గుర్తించపోవడంతో అదుపుతప్పి లారీ లోడుతో రోడ్డు పక్కన ఉన్న జెసిబి గుంతలో పడింది. దీంతో ఒక్కడే ఉన్న డ్రైవర్ రమాకర్ యాదవ్ (32) ఎక్కడికి అక్కడే మృతి చెందాడు.

లారీ ఓనర్ సోహెబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, శివ పంచనామ నిర్వహించి పోస్టుమార్టం పంపినట్లు తెలిపారు. ఇట్టి లారీ స్టీల్ ( ఐరన్ ) లోడు శంకరంపేట (రా) గ్రామంలో గల కావేరి స్టిల్స్ యందు లోడ్ చేసుకుని సిద్దిపేట వైపు వెళ్తుండగా తిమ్మాపూర్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ క్యాబిన్లో ఇరుకపోవడంతో మృతి చెందాడు.

REALETED NEWS :