Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి..! 

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి..! 

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం నారిగానిపల్లె సమీపంలో గుట్టలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు కాటేవారి పల్లెకు చెందిన రామచంద్ర కుమారుడు రెడ్డిశేఖర్ (24) ఆదివారం ఉదయం నారిగానిపల్లె సమీపంలో ని గుట్టలో శవమై కనిపించాడు.

కొడుకు మరణవార్త విన్న రామ చంద్రప్ప దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై వెంకటసుబ్బయ్య, సిఐ రమేష్ తమ పోలీసు సిబ్బంది తో సంఘటనా స్థలానికి చేరుకుని రెడ్డిశేఖర్ మృతిపై గ్రామస్తులను విచారించారు.

అనంతరం శవ పరీక్ష కోసం మృతదేహాన్ని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతుని తండ్రి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు