After 18 Years : 18 ఏళ్ల తర్వాత వారు కలిశారు..!
After 18 Years : 18 ఏళ్ల తర్వాత వారు కలిశారు..!
రంగారెడ్డి జిల్లా,ఆమనగల్లు జులై 27 మనసాక్షి:
ఆనందం ఉద్వేగం ఆప్యాయత పలకరింపులు చిన్ననాటి జ్ఞాపకాలు చిలిపి ముచ్చట్లు మధుర మైన జ్ఞాపకాలతో సందడిగా నెలకొంది. ఆమనగల్లు మండల పరిధిలోని ఆకుతోట పల్లి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005 – 2006 సంవత్సరంలో పదోవ తరగతి పూర్తి చేసుకున్నారు.
18 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లోని ఎస్విఎమ్ కాన్ఫరెన్స్ హాల్లో ఆత్మీయ సమ్మేళనంలో కలుసు కోవడంతో వారి సంతోషాలకు అవధులు లేకుండా పోయాయి ఒకరినొకరి ఆప్యాయంగా పలకరించుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆనాడు తాము కూర్చున్న తరగతి గదులు,తాము చేసిన అల్లరి,పాఠశాల ప్రాంగణం గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో పలు సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు.
ALSO READ :
Viral : విచిత్ర దొంగ.. దొంగతనానికి వస్తే ఇంట్లో ఏమీ లేవని సీసీటీవీ వద్ద ఆవేదన..!
Komatireddy, Hareeshrao : కోమటిరెడ్డిని హరీష్ రావు అంత మాట అనేశాడా.. అయితే ఆయన రియాక్షన్ ఏంటి..!









