వెంపటి : ఘనంగా ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం

వెంపటి : ఘనంగా ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం

తుంగతుర్తి , అక్టోబర్ 15, మన సాక్షి ; మండల పరిధిలోని వెంపటి గ్రామంలో మండల పరిషత్ ఉన్నత పాఠశాల నందు శనివారం ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం (గ్లోబల్‌ హ్యాండ్‌ వాష్‌ డే)ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుదగాని వెంకట రామనరసమ్మ మాట్లాడుతూ… వ్యక్తిగత శుభ్రత,పరిసరాల పరిశుభ్రత, పరిశుభ్రమైన త్రాగునీరు 70% వ్యాధులను అరికడతాయన్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు.

ALSO READ : లాక్ షోర్ పాఠశాలను వెంటనే సీజ్ చేయాలి

ఏదైనా పనిచేసిన తర్వాత, క్రీడలు ముగించుకొన్న తర్వాత, పాఠశాల నుండి ఇంటికి వెళ్లిన తర్వాత చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు.చేతులను శుభ్రంగా ఉంచుకోవడంపై తమ కుటుంబసభ్యులకు, చుట్టుప్రక్కల వారికి అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత విద్యార్థులపై ఎంతైనా ఉందన్నారు. ఇందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది అక్టోబర్‌ 15వ తేదీన ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వారు గుర్తు చేశారు.

ALSO READ : మేళ్లచెరువు : తృటిలో తప్పిన విద్యుత్ ప్రమాదం

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు దీవెనపల్లి శ్రీనివాస్, పాలకుర్తి ఎల్లయ్య, పాలకూరి జ్యోతి, మల్లెపాక రవీందర్, గుండ్ల ఆంజనేయులు, స్వాతి, రమాదేవి, వెంకన్న మరియు విద్యార్థులు పాల్గొన్నారు.