వెంకటాపురం : మండలంలోని వీరాపురంలో విషాదం
వెంకటాపురం : మండలంలో విషాదం
కరెంట్ షాక్ తగిలి మరణించిన యువకుడు.
వెంకటాపురం, మనసాక్షి.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పేడువీరాపురం పంచాయతీలో కరెంట్ షాక్ తగిలి యువకుడు మరణించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరాపురం గ్రామంలో సోమవారం ఉదయం 9 గంటల సమయంలో కొండగొర్ల. ప్రశాంత్ ( 22) ఇంట్లో భోజనం చేసిన తర్వాత బయటకు వచ్చే బట్టలు ఆరేయడానికి కట్టిన తీగను పట్టుకున్నాడు.
కరెంట్ షాక్ తగిలి గిలగిలా కొట్టుకోవడంతో ఇంట్లో వాళ్ళు గమనించి విద్యుత్ సరఫరాను బంద్ చేసి హుటా హుటేనా ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకువచ్చారు. డాక్టర్ పరిశీలించి చనిపోయినట్టు నిర్ధారించారు.మృతుడి భార్య నాలుగు నెలల గర్భవతి ప్రశాంత్ చనిపోయాడు.
బంధువులు పెద్ద ఎత్తున హాస్పిటల్ కి చేరుకొని గుండెలు బాదుకుంటూ బోరు బోరున విలపించారు. ఎస్సైకే. తిరుపతిరావు కేసు నమోదు చేసి విచారిస్తామని తెలిపారు









