Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Lock : ఆ గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం

ఆ గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం

నారాయణపేట, మన సాక్షి:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ సెక్రటరీలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా కోటకొండ గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆఫీస్ కి తాళం వేస్తూ గ్రామపంచాయతీ సెక్రటరీలకు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. కార్మిక వర్గం గ్రామ సర్పంచ్ కో ఆప్షన్ నెంబర్ ప్రగతిశీల యువజన సంఘం గ్రామ యువకులు గ్రామ ప్రజలు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రానికి అవార్డులు రావడంలో ప్రధాన పాత్ర పోషించిన గ్రామపంచాయతీ సెక్రటరీలు. వారి సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వహిస్తూ వహిస్తున్న దానికి నిరసనగా సెక్రటరీలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు.

 

గత నాలుగు రోజులుగా న్యాయమైన డిమాండ్లతో పంచాయతీ సెక్రెటరీ లు చేస్తున్న సమ్మెకు పార్టీ ప్రజా సంఘాలు ప్రజలు యువకులు పెద్ద ఎత్తున మద్దతు తెలియజేయాలని కోటకొండ సర్పంచ్ విజయలక్ష్మీ, కోఆకోప్షన్ మెంబర్ యాదగిరి, పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్ , గ్రామ కార్యదర్శి నరసింహ పిలుపు నిచ్చారు. వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలియజేశారు.

 

ఇప్పటికైనా పంచాయతీరాజ్ శాఖ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి పంచాయతీ సెక్రటరీల సమస్యలు పరిష్కరించాలని వాళ్ళందరికీ రెగ్యులరేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో. సిపిఐ (ఎంఎల్) ప్రజా పంథా పార్టీ గ్రామ పార్టీ నాయకలు హాజీ ఎదురింటి రాములు. మాజీ ఎంపిటిసి సరళ ఏ. లక్ష్మి. కే. నాగమణి వెంకటమ్మ వెంకటమ్మ .

 

భీమేష్ ప్రగతిశీల యువజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సలీం. జిల్లా కార్యవర్గ సభ్యులు ఇస్మాయిల్ .కృష్ణ హనుమంతు రామచందర్ అశోక్ ఎస్ రాము. రాఘవేంద్ర. అబ్దుల్ రెహ్మాన్. కరోబార్ నరసింహ. గ్రామపంచాయతీ వర్కర్స్ కిష్టప్ప సాయిలు అంజిలప్ప చంద్రప్ప. కాజమ్మ భారతమ్మ.మహిళలు గ్రామయులకు పాల్గొని పెద్ద ఎత్తున మద్దతు తెలియజేశారు.

మరిన్ని వార్తలు