పురుగుల మందు తాగి భార్య, రోడ్డు ప్రమాదం లో భర్త మృతి

వేరు వేరు ఘటనల్లో భార్య, భర్త మృతి

పురుగుల మందు తాగి భార్య, రోడ్డు ప్రమాదం లో భర్త మృతి

వేరు వేరు ఘటనల్లో భార్య, భర్త మృతి

లక్షేట్టిపేట్ , (మన సాక్షి);

మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట్ మండలంలోని ఎల్లారం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొన్నది. గ్రామానికి చెందిన రేఖేందర్ శరణ్య (28) సంవత్సరాల మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా చికిత్స పొందుతూ శనివారం కరీంనగర్ లోని శ్రీ హర ఆసుపత్రిలో సాయంత్రం మృతి చెందింది.

 

వివరాలకు వెళ్ళితే మృతురాలి ఇంటి ప్రక్కనే ఉన్నటువంటి మహిళ శరణ్యను బూతులు తిట్టింది. ఇరుగు పోరుగువారు వచ్చి ఇద్దరిని ఆపి పంపించారు. ఆ తర్వాత రజని ఇంటి ప్రక్కన ఉన్న రేఖేందర్ రాణి అనే మహిళ రజని నీ ప్రేరేపిస్తు లక్షెట్టిపేట పోలీస్ స్టేషనులో పిర్యాదు చేయించగా , తద్వారా శరణ్య మనస్థాపం చెంది ఇంటి వద్ద పురుగుల మందు తాగింది.

 

ఇది గమనించిన కుటుంబ సభ్యులు శరణ్యను లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

 

ALSO READ : 

 

1. Runa Mafi : తెలంగాణలో రైతుల పంట రుణాలు మాఫీ.. ఎప్పుడంటే..!

2. Rythu : నెల రోజుల్లో కోటీశ్వరుడైన రైతు.. 20 ఏళ్ల దరిద్రం పోయింది..!

3. Railway Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో 3624 రైల్వే ఉద్యోగాలు..!

4. మిర్యాలగూడ : పోలీస్ స్టేషన్ లోనే కొట్టుకున్నారు వాళ్లు ..!

 

మృతురాలి భర్త మల్లిఖార్జున్ పిర్యాదు మేరకు శరణ్య మరణంకు కారణమైన వావిలాల రజని, రేఖేందర్ రాణి పై కేసు నమోదు చేయడం జరిగింది. ఇదిలా ఉండగా కరీంనగర్ లో చనిపోయిన శరణ్య శవంను భర్త అయిన మల్లికార్జున్, తన తండ్రి , బందువులను అబ్బులెన్స్ లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి వెనుకాల బైక్ పై తన సడ్డకునితో బయలుదేరాడు.

 

కరీంనగర్ చౌరస్తాలో మల్లికార్జున్ బైక్ ఆపి టాయిలెట్ కోసం రోడ్డు దాటుతుండగా అర్ధరాత్రి అందాజ ఒంటి గంటల సమయంలో కరీంనగర్ చౌరస్తా వద్ద రాయపట్నం నుండి లక్షెట్టిపేట వైపు వస్తున్న లారీ డ్రైవర్ తన లారీని అతి వేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటు వచ్చి రోడ్డు దాటుతున్న మల్లికార్జున్ నీ డీకొట్టి తన పై నుండి లారీ వెల్లగా బాడీ మొత్తం నుజ్జు నుజ్జు అయి అక్కడిక్కడే చనిపోయినాడు.

 

మృతుని తండ్రి రేఖేందర్ మాధుసుదన్ రావు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు లక్షేట్టిపేట్ ఎస్సై లక్ష్మణ్ తెలిపారు.