మిర్యాలగూడ : 43 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం..!

రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేసే కఠిన చర్యలు తీసుకుంటామని మిర్యాలగూడ రూరల్ ఎస్సై నరేష్ హెచ్చరించారు.శనివారం మండల కేంద్రంలోని ఉట్లపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 43 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మిర్యాలగూడ : 43 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం..!

పిడిఎస్ రవాణా చేస్తే చర్యలు తప్పవు

– మిర్యాలగూడ రూరల్ ఎస్సై నరేష్

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేసే కఠిన చర్యలు తీసుకుంటామని మిర్యాలగూడ రూరల్ ఎస్సై నరేష్ హెచ్చరించారు.శనివారం మండల కేంద్రంలోని ఉట్లపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 43 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించామని పేర్కొన్నారు.

బొల్లెద్దు పాపయ్య తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్న వారి వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. పిడిఎస్ బియ్యాన్ని ఎక్కువ ధరకు అమ్ముకొనుటకు తన నివాసంలో 43 క్వింటాల బియ్యాన్ని నిల్వ ఉంచుకున్నట్లు పేర్కొన్నారు. ఆర్.ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఆయన వెంట కానిస్టేబుల్ లు ఉన్నారు.

ALSO READ : 

KTR : కేటీఆర్ ట్విట్టర్ లో కాంగ్రెస్ భరోసా కార్డు.. ఎందుకు పోస్ట్ చేశాడబ్బా.. తెలుసుకుందాం..!

Miryalaguda : మిర్యాలగూడలో ఏంటి ఇలా.. కాంగ్రెస్ పార్టీలో అప్పుడే మొదలయ్యిందా..?

Whatsapp : వాట్సాప్ లో డిలీట్ ఫర్ ఆల్ కు.. బదులు డిలీట్ ఫర్ మీ నొక్కారా.. అయినా రీస్టోర్ చేసుకోవచ్చు..!