Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

మిర్యాలగూడ : డోర్నకల్ – మిర్యాలగూడ కొత్త రైలు మార్గం..!

మిర్యాలగూడ : డోర్నకల్ – మిర్యాలగూడ కొత్త రైలు మార్గం..!

మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సందర్శించిన ఎంపీ ఉత్తమ్ వెల్లడి

మిర్యాలగూడ , మనసాక్షి :

డోర్నకల్ నుంచి కోదాడ హుజూర్ నగర్, నేరేడుచర్ల మీదుగా మిర్యాలగూడకు సూత్రప్రాయంగా కొత్త రైలు మార్గం మంజూరైనట్లు నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు.

 

ఆదివారం ఆయన నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ రైల్వే స్టేషన్ ను సందర్శించారు. రైల్వే స్టేషన్ లో సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం ప్రయాణికులతో మాట్లాడి సౌకర్యాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

 

ALSO READ : TSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రూట్లలో 10 శాతం రాయితీ..!

 

పార్లమెంటులో , వెలుపల తన నిరంతర ప్రాతినిధ్యాల కారణంగా, ఇప్పుడు మిర్యాలగూడ , నల్గొండ రైల్వే స్టేషన్లలో రైళ్లను నిలిపివేస్తున్నట్లు ఆయన చెప్పారు.
చెన్నై ఎక్స్‌ప్రెస్, తిరుపతి ఎక్స్‌ప్రెస్, విశాఖ ఎక్స్‌ప్రెస్, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు స్టేషన్ లలో ఆపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

 

 

అలాగే డోర్నకల్‌ నుంచి కోదాడ, హుజూర్‌నగర్‌, నేరేడుచెర్ల మీదుగా మిర్యాలగూడ వరకు కొత్త రైలు మార్గానికి సూత్రప్రాయంగా మంజూరైనట్లు తెలిపారు.
ప్రస్తుతం గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తున్న మేళ్లచెరువు-మట్టంపల్లి-జానపాడు-విష్ణుపురం-మిర్యాలగూడ రైల్వేలైన్‌లో ప్యాసింజర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు తాను కృషి చేస్తున్నట్లు చెప్పారు.

 

ALSO READ : TSPSC : తెలంగాణ గ్రూప్ – 4 పరీక్షలో బలగం సినిమాపై ప్రశ్న.. సోషల్ మీడియాలో వైరల్ .. అది ఏంటంటే..?

 

మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యాల పెంపుదల అంశాన్ని రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లేవనెత్తుతామని చెప్పారు..

 

ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, నాయకులు మహబూబ్ అలీ, తమ్ముడబోయిన అర్జున్ తదితరులు ఉన్నారు

మరిన్ని వార్తలు