Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లా

Land : భూమిని చూపిస్తారా, మమ్మల్నే చూసుకోమంటారా..?

Land : భూమిని చూపిస్తారా, మమ్మల్నే చూసుకోమంటారా..?

చర్ల,మనసాక్షి:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని గోదావరి పరీవాహిక ప్రాంతంలో ఉన్న ముప్పు గ్రామాలలో వరద బాధితుల పోరాట సంఘం నాయకత్వం బుధవారం పర్యటించడం జరిగింది.ఈ సందర్భంగా లింగాపురం గ్రామంలో జరిగిన వరద బాధితుల జనరల్ బాడీ సమావేశంలో వరద బాధితుల పోరాట సంఘం గౌరవ అధ్యక్షుడు కొండ చరణ్ మాట్లాడుతూ..

 

ఈనెల 10వ తారీఖున వరద బాధితులకు శాశ్వత పరిష్కారంగా చర్ల మండల కేంద్రంలో మెరక ప్రాంతంలో ఐదు సెంట్ల ఇంటి స్థలం ప్రతి కుటుంబానికి కులం మతం ప్రాంతం బేధం లేకుండా ఇవ్వాలని వందలాదిగా రెవెన్యూ అధికారి చర్ల ఎమ్మార్వో కి వినతి పత్రాలు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది.

 

ఆ సందర్భంలో అధికారి మాట్లాడుతూ గ్రామాలలో క్షేత్ర స్థాయి పరిశీలన చేసి నిజమైన వరద బాధితులను గుర్తించేందుకు సర్వే నిర్వహిస్తామని అన్నారని ఆయన తెలిపారు. కచ్చితంగా వరద బాధితులకి మెరక ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తానని హామీ ఇచ్చారని అన్నారు.

 

ALSO READ : 

1. Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!

2. TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!

3. TSPSC : టి ఎస్ పి ఎస్ సి గ్రూప్ -2 పరీక్ష తేదీలు మారాయి.. కొత్త తేదీలు ఇవే..!

 

హామీ ఇచ్చి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు గ్రామాల్లో సర్వే జరగలేదని వరద బాధితులకి ఇల్లు నిర్మించుకునేదానికి ఎక్కడ కూడా భూమిని చూపించలేదని వరద బాధితుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరిని వరద బాధితుల పోరాట సంఘం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు.

 

ఇప్పటికైనా అధికారులు ప్రతి ఏడాది వరద బాధితులు పడుతున్నటువంటి బాధలను అర్థం చేసుకొని వారి సమస్యపై దృష్టి పెట్టాలని అన్నారు. రానున్న రెండు రోజుల్లో వరద బాధితులను గుర్తించి ప్రతి వరద బాధిత కుటుంబానికి చర్ల మండల కేంద్రంలో మేరక ప్రాంతంలో ఐదు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని లేని ఎడల వరద బాధితులమైన మేమే ఎక్కడ ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంటే అక్కడ ఇంటిని నిర్మించుకోని నివాసం ఉంటామని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో వరద బాధితులు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా అంకుఠిత దీక్షిత్తో పోరాడాలని ఐదు సెంట్ల ఇంటి స్థలం దక్కించుకొని ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చేసుకోవాలని బాధితులకు పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమంలో వరద బాధితుల పోరాట సంఘం అధ్యక్షులు బోడా సందీప్ కార్యదర్శి కొండ కౌశిక్ గ్రామస్తులు రామకృష్ణ, రాంబాబు, మోహన్, నాగరాజు, సాయి,ప్రేమిల,శ్రీలత, సరోజిని, రజిత, ఝాన్సీ, ఆదెమ్మ, పుల్లమ్మ, నిలమ్మా, కళావతి, రమాదేవి, లెయ్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు