Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లారాజకీయం

వరద బాధితులకు కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

వరద బాధితులకు కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

రాష్ట్ర నాయకులు కేచ్చేల రంగారెడ్డి

చర్ల, మనసాక్షి:

చర్ల మండల కేంద్రంలో సర్వేనెంబర్117 భూమిలో జరుగుతున్న వరద బాధితుల ఇంటి జాగల పోరాట కేంద్రాన్ని ప్రజాపందా పార్టీ నాయకత్వం మంగళవారం సందర్శించింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపందా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి, రాష్ట్ర నాయకులు ముద్దా భిక్షం మాట్లాడుతూ వరద బాధిత ప్రజలు చేస్తున్న పోరాటం న్యాయమైందని ప్రభుత్వం ఈ వరద బాధితులను ఆదుకోవాలని అన్నారు .

 

ప్రభుత్వ భూములపై ప్రజలకు అధికారం ఉందనిఅన్నారు.ఆక్రమణదారులకు సహకరించే అధికారులు ఆపదలో ఉన్న పేద ప్రజలకు ఎందుకు సహకరించరు అని ప్రశ్నించారు. వరద బాధితులు చేస్తున్న పోరాటం పట్ల పోలీసుల అత్యుత్సాహాన్ని మానుకోవాలని అన్నారు. ప్రజలకు భూమిని ఇవ్వాలా వద్దా అనేది ప్రభుత్వం అధికారులు తేలుస్తారని అప్పటివరకు పోలీసుల ఈ విషయంలో జోక్యాన్ని తగ్గించుకోవాలని అన్నారు.

 

దేశంలో ఏ వ్యవస్థ అయినా ప్రజల్ని కాపాడుకోవడం కోసం ఏర్పరచుకున్నదేతప్ప మరి వేరే కాదని అన్నారు.పోలీసు వారు మా భూమి అని అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వ్యక్తికి ఇంటి జాగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం విఫలం అవ్వడం వల్లనే ప్రజలు ఈ భూమిని ఆక్రమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

 

వరద బాధితులకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని అన్నారు. రెవిన్యూ వాళ్లు ప్రత్యానమయ భూమిని ఈ ప్రజలకు చూపించేంతవరకు ఇక్కడ నుంచి ఇంచు కూడా కదిలేది లేదని అన్నారు.ఇప్పటికైనా పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకొని అధికారులు ప్రభుత్వం స్పందించి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

 

ఈ వరద బాధితుల న్యాయమైన పోరాటానికి సిపిఐ ఎంఎల్ ప్రజాపందా పార్టీ నిరంతరం అండగా ఉంటుందని వరద బాధితులు ఎవరికి భయపడకుండా ఐక్యంగా పోరాడాలని తద్వారా ఐదు సెంట్లు జాగా సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపందా పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండా చరణ్ పి డి ఎస్ యు భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగల శివప్రసాద్ వరద బాధిత పోరాట సంఘం అధ్యక్షులు బోడా సందీప్ కార్యదర్శి కొండా కౌశిక్ మునిగేల నాగరత్నం నాగరాజు పురిటి ప్రశాంతు చిప్పనపల్లి శ్రీకళ జక్కా వెంకటేశ్వర్లు గంపల రమేషు మైప రాజేష్ కొంగురు సత్యం తదితరులు పాల్గొన్నారు.

 

ALSO READ : 

  1. TELANGANA :  బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల చేసిన కేసీఆర్
  2. దుబ్బాక : మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో కట్టెలు, రాళ్లతో దాడి.. 9 మంది అరెస్ట్..!
  3. TSRTC : మహిళ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ప్రత్యేక బస్సు సౌకర్యం..!
  4. Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!
  5. TSPSC : టి ఎస్ పి ఎస్ సి గ్రూప్ -2 పరీక్ష తేదీలు మారాయి.. కొత్త తేదీలు ఇవే..!

మరిన్ని వార్తలు