Telangana : తెలంగాణ కొద్దిమంది చేతుల్లో బందీ అయింది
Telangana : తెలంగాణ కొద్దిమంది చేతుల్లో బందీ అయింది
గుండాల , మనసాక్షి:
గుండాల మండల కేంద్రంలోని వాసవి గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడం ద్వారా బంగారు తెలంగాణ సాధన కోసం కృషి చేద్దామని త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నుంచి అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయించిన వారు గెలుపు కృషి చేయాలని ఆయన నాయకులకు కార్యకర్తలకు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్క సుమన్ మాట్లాడిన మాటలకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ లో ఉండడం కాదు మాకాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే బిఆర్ఎస్ పంపించడం జరిగిందని త్వరలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని తెలియజేశారు.
త్వరలో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం టిపిసిసి సభ్యుడు ఐలయ్య మాట్లాడుతూ ఇటీవల టిఆర్ఎస్ పార్టీ ధన బలం ఉన్న వారికి టికెట్లు కేటాయించడం జరిగిందని టిఆర్ఎస్ వారు ఇచ్చిన డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు.
కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని తెలిపారు గతంలో గుండాల ప్రాంతాల నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుర్రం యాదగిరిరెడ్డి కనీసం సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేదని రెండుసార్లు గెలిచిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మాత్రం వేలకోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు.
ALSO READ :
1; ఓట్లు మావే సీట్లు మాకే అంటూ.. భారీ బైక్ ర్యాలీతో గళమెత్తిన బీసీ నాయకులు..!
2. Raksha Bandhan : రక్షా బంధన్ పై సందిగ్ధం.. అదే రోజు భద్రకాలం, ఆ సమయంలో రాఖీ కట్టొద్దు..!
3. Tea : టీ తాగేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు.. టీలో అవి కలుపుకొని తింటే..!
4. Suryapet : వట్టే జానయ్య ప్రధాన అనుచరుడు పిల్లలమర్రి ఉపేందర్ అరెస్ట్, రిమాండ్..!
అలాగే గుండాల మండల పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డిని మండలకాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి గౌడ్ మండల పార్టీ అధ్యక్షుడు ఏలూరు రాంరెడ్డి, గుండాల సర్పంచ్ చిందం ప్రకాష్ వరలక్ష్మి, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండి షార్పొద్దిన్, పిఎసిఎస్ చైర్మన్ లింగాల భిక్షమయ్య, మాజీ ఎంపీపీ ధ్యాప కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు మాజీ జెడ్పిటిసి సభ్యుడు కోల్కొండ యాదగిరి, విశాలాక్ష్మి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.










