BIG BREAKING : వేములపల్లి : అదుపుతప్పి ఆటో బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు..!
BIG BREAKING : వేములపల్లి : అదుపుతప్పి ఆటో బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు..!
ఆటో బోల్తా…. ఏడుగురికి తీవ్ర గాయాలు
మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
వేములపల్లి, మన సాక్షి:
11 మంది కూలీలతో వస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడి ఏడుగురికి గాయాలైన ఘటన బుధవారం సల్కునూరు గ్రామ శివారులో చోటుచేసుకుంది.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారంగా
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం పరిధిలోని రావులపెంట గ్రామానికి చెందిన రోజువారి కూలీలు 11 మంది ఆటోలో రోజు మాదిరిగానే పత్తి చేనులో కలుపు తీయడానికి సర్వారం గ్రామం వెళ్లి ఇంటికి వస్తున్న క్రమంలో సల్కనూర్ గ్రామం చివరకు రాగానే ఆటో టర్నింగ్ మలుపుతున్న క్రమంలో అదుపుతప్పి బోల్తాపడడంతో ఘటన చోటుచేసుకుంది,
ఆటోలో ప్రయాణిస్తున్న 11 మంది కూలీలలో ఏడుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు.. స్థానికులు క్షతగ్రతలను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ లోని ఏరియా హాస్పిటల్ కి తరలించారు.. క్షతగ్రతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ALSO READ :










