Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Telangana Elections : తెలంగాణ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి.. ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్..!

Telangana Elections : తెలంగాణ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి.. ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్..!

టికెట్ కోసం అభ్యర్థుల్లో బిగ్ ఫైట్

నల్గొండ, మన సాక్షి :

ఎన్నికలు వచ్చాయంటే ఇరు పార్టీల మధ్య పోటీ ఉండడం సహజం. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అంటున్నారు ఆ నాయకులు. నల్గొండ జిల్లాలో నాయకుల మధ్య అంతు చిక్కని విభేదాలు కాంగ్రెస్ పార్టీలోనే ఉందని చెప్పవచ్చును.

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మూడు విడతలుగా 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. కేవలం నాలుగు నియోజకవర్గాల మాత్రమే అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. వాటిలో మూడు నియోజకవర్గాలు కూడా నల్గొండ జిల్లాలో ఉండడం విచిత్రంగా ఉంది.

నల్గొండ జిల్లాలోని ఆ నియోజకవర్గాలలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అంటున్నారు అక్కడి నాయకులు. ఎవరికి టికెట్ ఇచ్చినా ఓడిస్తాం అనే చందంగానే పట్టు వీడని విక్రమార్కుల్లా ఉన్నారు. అందుకోసం ఆ అభ్యర్థులను ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు.

ALSO READ : Congress third List : 16 మందితో కాంగ్రెస్ మూడవ జాబితా

ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి, సీనియర్ నాయకులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్సెస్ పటేల్ రమేష్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ ఇద్దరు కూడా టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పటేల్ రమేష్ రెడ్డి.. రేవంత్ రెడ్డికి అనుచరుడుగా వస్తుండగా అతనికి టికెట్ వస్తుందని అతని అభిమానులు పేర్కొంటున్నారు. అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డికి.. ఉత్తంకుమార్ రెడ్డి అండదండలు ఉన్నాయని ఆయనకే టికెట్ వస్తుందని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు.

ALSO READ : మేడిగడ్డ కుంగి పోతుంటే.. కేసీఆర్ సాగర్ ప్రాజెక్టు గురించి మాట్లాడ్డం విడ్డూరం..!

ఇదిలా ఉండగా తుంగతుర్తి నియోజకవర్గం లో అద్దంకి దయాకర్ ఎప్పటినుంచో తనకు టికెట్ వస్తుందని పోటీ చేయడానికి.. ఆయన వర్గీయులంతా రేవంత్ రెడ్డికి అనుచరుడుగా ఉంటున్న అద్దంకి దయాకర్ కి టికెట్ వస్తుందని ప్రచారం సాగిస్తున్నారు.

కాగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు కూడా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. అతనికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి అండదండలు ఉన్నాయని ప్రచారం సాగుతుంది. అందుకు ఈ నియోజకవర్గంలో కూడా ఎవరిని ఇంకా అభ్యర్థులుగా ప్రకటించలేదు.

ALSO READ : రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విద్యార్థి ఉద్యమకారుడు వేముల గోపినాథ్

అదేవిధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి కుందూరు జానా రెడ్డి తనయుడు కుందురు రఘువీర్ రెడ్డి తో పాటు మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ కూడా రఘువీర్ రెడ్డికి తన తండ్రి జానారెడ్డి అండదండలు ఉన్నాయి.

కాగా భత్తుల లక్ష్మారెడ్డికి.. ఎంపీలు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండదండలు ఉన్నాయి. ఎవరికి సంబంధించిన అనుచరులు వారు తమకే టికెట్ వస్తుందని ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. మిర్యాలగూడ టికెట్ ఇరువురికి కాదని బీసీ అభ్యర్థికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

ALSO READ : కమ్యూనిస్టులతో కటీఫ్.. ఇక మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థి అతడే..!

మూడు నియోజకవర్గాల్లో పార్టీ టికెట్ ఒకరికి ఇస్తే ఇంకొకరికి నష్టం కలగకుండా పార్టీ కార్యచరణ చేపట్టి బుజ్జగించాల్సిన అవసరం ఉంది. లేదా కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా ఒకరికి టికెట్ వస్తే మరొకరు ఓడించేందుకు ప్రయత్నాలు సాగించే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల బిఆర్ఎస్ అభ్యర్థులకు లాభం కలిగే అవకాశం ఉంది. ఈ మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు ఒకరికి ఒకరు పోటీపడుతుండగా బిఆర్ఎస్ మాత్రం సంయమనం పాటిస్తుంది.

మరిన్ని వార్తలు