Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESక్రైంఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

BIG BREAKING : పొంగులేటి నివాసంలో ఐటి, ఈడి సోదాలు..! ఖమ్మం , మన సాక్షి :

BIG BREAKING : పొంగులేటి నివాసంలో ఐటి, ఈడి సోదాలు..! ఖమ్మం , మన సాక్షి :

కాంగ్రెస్ పార్టీ నాయకులు , ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఐటి, ఈడి సోదాలు జరుగుతున్నాయి. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసంలో సోదాలు మొదలైనట్లు ఆయన పేర్కొన్నారు.

8 వాహనాల్లో ఐటి, ఈడి అధికారులు పొంగులేటి నివాసానికి గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు చేరుకున్నారు. మొదట కుటుంబ సభ్యుల సెల్ ఫో లు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత తనిఖీలు ప్రారంభించారు.

.ఖమ్మం తో పాటు హైదరాబాదులోని నందగిరి హిల్స్ లో ఉన్న నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి.

ALSO READ : Telangana Elections : తెలంగాణ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి.. ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్..!

తనపై దాడులు జరుగుతాయని బుధవారం ఆయన చేసిన వ్యాఖ్యల అనంతరం కొన్ని గంటల్లోనే దాడులు జరగటం గమనార్హం.

గురువారం ఆయన పాలేరు అభ్యర్థిగా నామినేషన్ వేయాల్సి ఉంది. అందుకు ఆయన కుటుంబ సభ్యులంతా ఖమ్మంలోని ఆయన నివాసంలోనే ఉన్నారు. ఐ టి , ఈ డి తనిఖీల కారణంగా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందా..? లేదా..? అనేది వేచి చూడాల్సి ఉంది.

ALSO READ : Komatireddy : సీఎం పదవిపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

మరిన్ని వార్తలు