Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతరలుజిల్లా వార్తలుతెలంగాణవరంగల్ గ్రామీణ జిల్లావరంగల్ పట్టణ జిల్లా

Medaram : మేడారం భక్తురాలి వింత కోరిక..!

Medaram : మేడారం భక్తురాలి వింత కోరిక..!

హనుమకొండ , మన సాక్షి ;

సమ్మక్క సారలమ్మ మేడారం జాతర ఇటీవల ముగిసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చిన సంగతి విదితమే. జాతర ముగియడంతో అమ్మవారికి భక్తులు భారీగా కానుకలు కూడా సమర్పించారు. దాంతో జాతరలో ఏర్పాటుచేసిన హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని హనుమకొండలోని లస్కర్ బజార్ టీటీడీ కల్యాణ మండపంలో చేపడుతున్నారు. అమ్మవారికి నగదు , బంగారం భారీగా వచ్చాయి.

కాగా ఓ భక్తురాలు తమ కోరికను చీటీ మీద రాసి వేసింది. ఆ చీటీలో ఆమె కోరిన వింత… సమ్మక్క సారలమ్మ గిరిజనులే కాక అందరూ కొలుస్తారు. అమ్మవారికి బెల్లం బంగారంగా కోరిక తీర్చాలని వేడుకుంటారు. ఇదిలా ఉండగా అమ్మవారి హుండీలో ఓ చీటీ కల్పించింది. అందులో ఒక ఆవిడ వింత కోరిక కోరింది. తన భర్త గురించి రాసింది. బెట్టింగ్ మానేయాలని చీటీలో పేర్కొన్నది. పాపం బెట్టింగ్ వల్ల ఆమె ఎంత ఇబ్బంది పడిందో అర్థమవుతుంది. అందుకే అమ్మవారికి కూడా బెట్టింగ్ మానేయాలని చీటీ రాసి వేడుకుంది. దాంతో పాటు తన అక్క కుమారుడికి ఐఐటి సీట్ రావాలని కోరుకుంది. ఈ రెండు కోరికల చీటీ అమ్మవారికి సమర్పించింది.

ఇది ఇలా ఉండగా మొత్తం 317 ఉండి లను ఇప్పటివరకు లెక్కించగా 9.60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లుగా ఈవో రాజేంద్రన్ తెలియజేశారు.

ALSO READ : Telangana : తెలంగాణలో పేదలకు మరో శుభవార్త.. ఇందిరమ్మ ఇండ్లకు ముహూర్తం ఖరారు..!

మరిన్ని వార్తలు