Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణములుగు జిల్లా

జనంలోకి రండి.. కన్న వాళ్లతో కలిసి ప్రశాంతంగా జీవించండి..!

జనంలోకి రండి.. కన్న వాళ్లతో కలిసి ప్రశాంతంగా జీవించండి..!

మంగపేట ఎస్సై రవికుమార్

మంగపేట, మన సాక్షి ప్రతినిధి :

మావోయిస్టు సోదరులారా వనం వీడి జనంలోకి రండి కన్నా వాళ్లతో కలిసి ప్రశాంతంగా జీవించండి అని ములుగు జిల్లా మంగపేట ఎస్సై గోదారి రవికుమార్ అన్నారు. మండలంలోని పలు గ్రామాలలో మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలవాలని తెలియజేసే గోడపత్రికలను ఎస్సై రవికుమార్ మరియు సిబ్బందితో కలిసి అంటించి ప్రజలతో మాట్లాడారు.

మావోయిస్టు లు తమ హింస సిద్ధాంతాలు వదిలేసి వనం వీడి జనం లోకి వచ్చి తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని పిలుపునిచ్చారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు అందరూ జనజీవన స్రవంతిలో రావాలని, లొంగిపోయిన మావోయిస్టులకు పోలీసులు ప్రభుత్వం తరఫున సరైన సహాయం అందిస్తామని తెలియచేసారు. జనజీవన స్రవంతిలోకి వచ్చి కన్నవాళ్ళతో భార్యా పిల్లలతో కలిసి జీవిస్తూ సమాజాభివృద్ధికి తోడ్పడాలని అన్నారు.

ఎక్కువమంది చదివిన వార్తలు మీరు కూడా క్లిక్ చేసి  చదవండి.. 

 

మరిన్ని వార్తలు