Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లా

mavoist : మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన కరపత్రాలు..!

mavoist : మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన కరపత్రాలు..!

అశ్వాపురం, మనసాక్షి :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం, మిట్టగూడెం, పాములపల్లి, జగ్గారం తదితర గ్రామాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. బుధవారం మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య ఆదివాసీ సంఘం పేరిట కరపత్రాలు వెలిశాయి. “మావోయిస్టు దళం చెర నుండి మహిళల విముక్తికై పోరాడుదాం మావోయిస్టు దళంలో మహిళలపై లింగ వివక్షకు అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుదాం ”

దళంలో మహిళలతో వంటపని బ్యాగులు మోత నాయకుల వ్యక్తిగత పనులకి బానిసలుగా చూచే పద్ధతి నుండి విముక్తికై పోరాడుదాం మహిళా రిజర్వేషన్ ఉపయోగించుకుని మనమే పాలకులుగా మారుదాం
మాయదారి మావోయిస్టులను తరిమికొడదాం*! *ఆదివాసి మహిళాభివృద్ధికి తోడ్పడదాం !! అంటూ కరపత్రాల్లో పేల్కొన్నారు.

ALSO READ : BREAKING : నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తిరుమలకు వెళ్లి వస్తుండగా హైదరాబాదు వాసులు ఐదుగురు మృతి..!

మరిన్ని వార్తలు