Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజాతీయం

NREGS : ఉపాధి కూలీలకు గుడ్ న్యూస్..?

NREGS : ఉపాధి కూలీలకు గుడ్ న్యూస్..?

మన సాక్షి, వెబ్ డెస్క్:

దేశవ్యాప్తంగా కరువు కాటకాలను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికంగా చర్యలు చేపడుతుంది. ఉపాధి కూలీలకు పని కల్పించే లక్ష్యంతో (ఎన్ఆర్ఈజీఎస్ )జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకాన్ని 2005లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. నాటి నుంచి అదే పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది.

ఈ పథకం కింద అనేక రకాల పనులు చేపడుతూ కూలీలకు ఆసరాగా నిలుస్తుంది. వేసవికాలంలో పనులు లేక కూలీలకు ఇబ్బంది కలుగుతుందనే విషయం గమనించి దేశవ్యాప్తంగా వేసవికాలంలో పని కల్పించేందుకు వివిధ రకాల పథకాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది.

జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు ఉపాధి పొందుతున్నారు. ఈ పథకంలో అర్హులైన వారందరికీ వందరోజుల పాటు ఉపాధి కల్పిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఉపాధి కూలీలకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలియజేసింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీల వేతనాలను పెంచుతున్నట్లు పేర్కొన్నది.

అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున వేతనాల కోసం పెంపు కోసం కేంద్రం ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం ఈ విషయంపై ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరింది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిని ప్రభుత్వం తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికల సంఘం అనుమతి చెప్పడంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉపాధి కూలీలకు వేతనాలు పెరగబోతున్నట్లు సమాచారం. అయితే ఈ పథకంలో భాగంగా పెంచిన వేతనాలను ఎన్నికల్లో ప్రచారం చేయవద్దని ఎన్నికల కమిషన్ కోరినట్లు సమాచారం.

MOST READ : 

BREAKING : రైతు భరోసా పై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

Telangana : మీ కరెంట్ బిల్లు జీరో రాలేదా..? అయితే ఇలా చేయండి..!

Mega Plan 2050 : త్వరలో వైబ్రంట్‌ తెలంగాణ 2050, మెగా మాస్టర్‌ ప్లాన్‌.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!

Reporters Arrest : విలేకరుల బ్లాక్ మెయిల్.. కుటుంబం ఆత్మహత్య.. ఇద్దరు అరెస్టు, పరారీలో ముగ్గురు..!

Rythu Bandhu : రైతు బంధు అందరికీ ఇవ్వరా.. ఒక ఎకరం ఉన్న వారికి రాదా..!

మరిన్ని వార్తలు