Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండపండుగలు

Chinthapally : ప్రతి ఒక్కరు దైవ చింతనతో ముందుకు వెళ్లాలి..!

Chinthapally : ప్రతి ఒక్కరు దైవ చింతనతో ముందుకు వెళ్లాలి..!

బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి..

చింతపల్లి. మన సాక్షి :

దైవచింతనతో మానసిక ప్రశాంతత నెలకొంటుందని, హిందూ ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములై ముందుకు నడుచుకోవాలని బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం చింతపల్లి మండల పరిధిలోని కుర్మేడ్ గ్రామ సమీపంలో నెలకొని ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ గత రెండు వందల సంవత్సరాల క్రితం పూర్వికులు నెలకొల్పిన ఈ అమ్మవారి దేవాలయం ఎంతో ప్రాచుర్యం పొందిందని, అదేవిధంగా గుడి సమీపంలో దర్గా కూడా నెలకొని ఉండటం హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతి ఏటా జరుపుకునే వార్షికోత్సవం ఈ గ్రామ ప్రజలు కలిసి మెలిసి అమ్మవారి పండుగను చేయడం ఆనవాయితీగా వస్తుంది. దాతల సహకారంతో అమ్మవారి దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ దేవాలయ ప్రాంగణంలో భక్తులకు సకల సమకూర్చడం హర్షించదగ్గ విషయం అన్నారు.

 

భక్తిశ్రద్ధలతో వివిధ ప్రాంతాలనుంచి విచ్చేసిన భక్తులు అమ్మ వారిని దర్శించుకుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం చెప్పుకో తగ్గ విషయం అన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు వారి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల బీసీ సెల్ కన్వీనర్ అండే కార్ అశోక్, అండే కార్ నరేందర్, ఎంపిటిసి కుంభం శ్వేతా శ్రీశైలం గౌడ్, నాదిరి శ్రీశైలం ముద్దం కృష్ణయ్య గౌడ్, జంగయ్య, శేఖర్, రాజు, మల్లేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ALSO READ : Sleeping on The Foor : నేలపై పడుకుంటున్నారా.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!

మరిన్ని వార్తలు