Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డిరాజకీయం

BRS : చేవెళ్ల గడ్డపై పార్లమెంట్ ఎన్నికల శంఖారం..!

BRS : చేవెళ్ల గడ్డపై పార్లమెంట్ ఎన్నికల శంఖారం..!

కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి

మహేశ్వరం, (మన సాక్షి )

చేవెళ్ల గడ్డపై పార్లమెంట్ ఎన్నికల శంఖారం పూరించారు.
చలో చేవెళ్ల కార్యక్రమాన్ని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 13 వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభకు భారీగా తరలివచ్చి మనమందరం ఒక భరోసా కల్పించవలసిన అవసరం ఉందని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పేర్కొన్నారు.

 

అదే వేదిక ద్వారా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించిన చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని భారీ నుంచి అతి భారీ మెజారిటీ తో గెలిపించవలసిందిగా సబితా ఇంద్రా రెడ్డి గారి పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు ఆర్కల కామేష్ రెడ్డి, మేయర్ దుర్గా దీపులాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి, సిద్దాల లావణ్య ,అరకల భూపాల్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు శ్రీను నాయక్, యువజన విభాగం అధ్యక్షులు నాగరాజు, మరియు ఇతర కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

మరిన్ని వార్తలు