Suryapet : బాలెంల గురుకుల కళాశాలలో ప్రిన్సిపల్ గదిలో బీరు బాటిల్స్.. సంఘటనపై త్రి సభ్య కమిటీ..!
Suryapet : బాలెంల గురుకుల కళాశాలలో ప్రిన్సిపల్ గదిలో బీరు బాటిల్స్.. సంఘటనపై త్రి సభ్య కమిటీ..!
సూర్యాపేట , మనసాక్షి :
సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ప్రిన్సిపల్ గదిలో బీరు బాటిల్స్ ఉన్నాయని విద్యార్థులు ధర్నా చేసిన ఘటనపై రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు.
త్రిసభ్య కమిటీలో (కమిటీలో డిప్యూటీ సి.ఈ. ఓ శిరీష, ఆర్.డి.ఓ వేణు మాధవ్, ఎస్.సి. సంక్షేమ అధికారి లత ) తో జరిగిన సంఘటనపై వివరాలు అందచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇట్టి సంఘటన పై పూర్తి ఎంక్వయిరీ అధికారిగా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్. లతను నియమించినట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ALSO READ :
బాలెంల డిగ్రీ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ గదిలో లభ్యమైన బీరు సీసాలు..!
BREAKING : సినీ ఫక్కీలో చేజింగ్.. నార్కట్ పల్లి నుంచి దొంగలను వెంబడించిన పోలీసులు,.!









