మంచినీటి కష్టాలు.. బోరు, ట్యాంకర్ నీళ్లే దిక్కు.!
మంచినీటి కష్టాలు.. బోరు, ట్యాంకర్ నీళ్లే దిక్కు.!
మాడుగులపల్లి, (మన సాక్షి) :
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం మాడుగులపల్లి మండలం అభంగాపురం గ్రామంలో మంచినీటి కష్టాలు తీరడం లేదు. మిషన్ భగీరథ నీళ్లు రాక తాగునీరు కరువయ్యాయి. ట్యాంకర్ల ద్వారా మరియు వ్యవసాయ బోర్ల వద్ద తీసుకోచ్చుకుంటున్న గ్రామస్తులు.
ఈ సమస్య గురించి గ్రామస్తులు అధికారులకు ఎన్నో పర్యాయాలు విన్నవించారు. ఎవరు పట్టించుకోవడం లేదు. బోర్లు ట్యాంకర్ల వద్దనే నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది
నెలలు గడుస్తున్నా సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి :
మిర్యాలగూడ : బహిరంగ ప్రదేశాలలో మద్యపానం.. 10 మంది అరెస్టు..!
District collector : కృష్ణానది పరివాహక ప్రాంతంలో అలర్ట్.. జిల్లా కలెక్టర్ హెచ్చరిక..!
ఎల్లంపల్లి ప్రాజెక్టులో 17.81 టీఎంసీలు, సందర్శించిన జిల్లా కలెక్టర్..!
Cm Revanth Reddy : విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా అమలు..!









