Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది.. జిల్లా కలెక్టర్

Miryalaguda : ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది.. జిల్లా కలెక్టర్

వాతావరణ సమతుల్యం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

మొక్కలు నాటడం తో పాటు, వాటిని సంరక్షించాలి

మిర్యాలగూడ,  మన సాక్షి:

పరిశ్రమలతో అభివృద్ధి వస్తుందని , అదే సమయంలో అభివృద్ధితోపాటు, వాతావరణ సమతుల్యం అవసరమని, ఇందుకోసం ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ సి .నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం అయన నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణం, అవంతిపురం ఈద్గా వద్ద స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తో కలిసి వనమహోత్సవం కింద మొక్కలు నాటారు.

వనమహోత్సవం కింద పెద్ద ఎత్తున (2500) మొక్కలు నాటడం సంతోషమని కలెక్టర్ అన్నారు. మిర్యాలగూడ లాంటి ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయని ,పరిశ్రమల వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అయితే పరిశ్రమల వల్ల వాతావరణ కాలుష్యం కాకుండా పెద్ద ఎత్తున మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని అన్నారు.

స్థానిక శాసనసభ్యులు నియోజకవర్గం లో వనమహోత్సవం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు, స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో విరివిగా పాల్గొనడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. మిర్యాలగూడలో రైస్ మిల్లర్లు ఎక్కువగా ఉన్నందువలన వారు సైతం మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు.

మొక్కలు నాటడంతో పాటు, మొక్కల సంరక్షణ పై ప్రజా ప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని , ఉపాధి హామీ పథకం కింద 3 సంవత్సరాల వరకు మొక్కలు నాటి సంరక్షించే అవకాశం ఉందని, ఇందుకు వాచర్లను నియమించుకోవాలని, అంతేకాక సంరక్షణ బాధ్యతలను సైతం మూడేళ్ల వరకు వారే చూస్తారని తెలిపారు.

అధికారులు సైతం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. అన్ని గ్రామ పంచాయతీలలో నీటి ట్యాంకర్లు ఉన్నందున వాటిని వినియోగించుకోవాలని, ఎట్టి పరిస్థితులలో మొక్కలు చనిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని తాము పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇందులో భాగంగా 2500 మొక్కలు నాటుతున్నట్లు ఆయన వెల్లడించారు.

స్వచ్ఛదానం పచ్చదనం కింద సైతం పెద్ద ఎత్తున మొక్కలు నాటామని వన మహోత్సవంలో మిర్యాలగూడ పట్టణంతోపాటు ,నియోజకవర్గంలో మొక్కలు నాటుతున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మడబోయిన అర్జున్, నాయకులు స్కైలాబ్ నాయక్, మహబూబ్ అలీ, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

Ration Cards : రేషన్ కార్డులపై సంచలన నిర్ణయం.. ఇవీ అర్హతలు..!

భారీ గుడ్ న్యూస్ : ఫోన్ పే, గూగుల్ పే మీకు ఉందా..! ఉంటే తెలుసుకోవాల్సిందే

Rythu Barosa : రైతు భరోసా వారికేనా.. ఆలస్యం అందుకేనా..!

Good News : రైతులకు కేంద్రం సర్కార్ గుడ్ న్యూస్.. ఎరువుల ధరపై సబ్సిడీ పెంపు..!

మరిన్ని వార్తలు