Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

మాకు లేదా రుణమాఫీ.. విధివిధానాలు రానప్పుడు సమావేశం ఎందుకు, రైతుల ఆందోళన..! 

మాకు లేదా రుణమాఫీ.. విధివిధానాలు రానప్పుడు సమావేశం ఎందుకు, రైతుల ఆందోళన..! 

నేలకొండపల్లి, మన సాక్షి:

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పొందేందుకు తమకు అర్హత లేదా అని రైతులు అగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని రైతు వేదిక లో మంగళవారం నిర్వహించిన సమావేశం లో రైతులు వ్యవసాయాధికారులను నిలదీశారు.

మండలం లోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రుణమాఫీ రాని రైతులు తరలివచ్చారు. సమావేశంలో మండల వ్యవసాయాధికారి ప్రసాదావు మాట్లాడుతుండగా అడ్డుకున్నారు. అర్హత ఉన్న రైతులకు ఎందుకు రుణమాఫీ వర్తించదు అని ప్రశ్నించారు.

వివిధ కారణాల చూపుతూ రైతులకు రుణమాఫీ రాకుండా చేశారని అగ్రహించారు. రైతులు అరుపులు, కేకలతో సమావేశం రసాభసా గా మారింది. సమావేశంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఏవో ప్రసాదావు -తమకు ఎలాంటి గైడ్లైన్స్ రాలేదని చెప్పటంతో రైతులు మండిపడ్డారు.

విది విదానాలు రానప్పుడు ఎందుకు సమావేశం నిర్వహించారని నిలదీశారు. అలాంటప్పుడు ప్రత్యేక సెల్ ఎవరి కోసమని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత ఉన్న వారికి రుణమాఫీ వస్తుందా రాదా అని నిలదీశారు. అధికారుల వద్ద సమాధానం మిన్నికుండిపోయారు.

ఈ మీటింగ్ వలన ఎలాంటి ప్రయోజనం లేదంటూ సమావేశం నుంచి రైతులు వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో ఏవో ప్రసాల్రావు, ఏఈవో లు శిరిష, దుర్గాభవాని, అవినాష్, మాజీ ఎంపీపీ తీగ వెంకటేశ్వర్లు, రైతు సంఘం ప్రతినిధులు దండా నరసింహారావు, నూక హనుమంతరావు,పాకనాటి సీతారామిరెడ్డి, పాపయ్య, నాగేశ్వరరావు, వెంకన్న, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ :

దర్జాగా కారులో వచ్చి.. రాత్రికి రాత్రే షాపులన్నీ దోచేశారు, సీసీ పూటేజీలో రికార్డ్..!

Nalgonda : ప్రశ్నిస్తే బ్యాంకు చుట్టూ తిప్పుతాం.. రైతులను హడలెత్తిస్తున్న బ్యాంకు మేనేజర్..!

Fertilizer : ఎరువుల దుకాణాలు ఆకస్మిక తనిఖీ..!

District collector : సూర్యాపేట జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. రైతులను ఇబ్బందులు పెట్టిన తహసిల్దార్ బదిలీ, ఇద్దరు రెవెన్యూ ఉద్యోగుల సస్పెండ్..!

మరిన్ని వార్తలు