Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా

Fertilizer : ఎరువుల దుకాణాలు ఆకస్మిక తనిఖీ..!

Fertilizer : ఎరువుల దుకాణాలు ఆకస్మిక తనిఖీ..!

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో ఉన్న ఎరువుల దుకాణాన్ని మంగళవారం మండల ప్రత్యేక అధికారి ఏడిఏ నూతన్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి షాప్ లో స్టాక్ రిజిస్టర్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని ఆయన ఆదేశించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఫర్టిలైజర్ లో ఉన్న స్టాక్ ఏ కంపెనీకి సంబంధించిన స్ప్రే మందులు ఉన్నాదో వాటికి పైన ఉన్న వ్యాలిడిటీ డేట్ ను చూశారు.సోయా, పెసరి, మినుములకు ఫార్ములా 4 ఇవ్వాలని సూచించారు.

ఇవ్వడం వలన విత్తనాలు సైజును పెంచి అధిక దిగుబడిని ఇస్తుందన్నారు. అనంతరం షాప్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవడంతో పాటు రోజువారీగా రైతుల విక్రయించే మందుల స్టాక్ రిజిస్టర్ అప్డేట్ చేయాలన్నారు.

రైతులకు విక్రయించే మందుల వివరాలు కచ్చితంగా నోటీస్ బోర్డ్ షాపు ముందు ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో షాప్ డీలర్ తదితరులు ఉన్నారు.

ALSO READ : 

హైదరాబాద్ నగరంలో కుండపోత.. జలమయమైన రోడ్లు, కాలనీలు..!

యువకుడి సెల్ఫీ వీడియో.. ప్రాణం తీసిన ఆన్ లైన్ బెట్టింగ్..!

Vemulapally : నాగార్జున సాగర్ ఎడమ కాలువలో బాలిక గల్లంతు..!

Miryalaguda : సాగర్ వరద కాలువకు నీటిని విడుదల చేయాలి.. నార్కట్ పల్లి, అద్దంకి హైవేపై బైఠాయించిన రైతులు..! 

మరిన్ని వార్తలు