HYDERABAD : ప్రియురాలి పై ప్రియుడు కత్తితో దాడి..!
HYDERABAD : ప్రియురాలి పై ప్రియుడు కత్తితో దాడి..!
ఉప్పల్ , మనసాక్షి :
ప్రియురాలి పై ప్రియుడు కత్తితో దాడి చేసిన సంఘటన హైదరాబాదులోని ఉప్పల్ లో చోటుచేసుకుంది. ఉప్పల్ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన భావన, సాయికుమార్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
భావన మొయినాబాద్ లోని వి ఆర్ కె మహిళా కళాశాలలో బీటెక్ చదువుతోంది. కాగా కొన్ని రోజులుగా సాయికుమార్ తో భావన దూరంగా ఉంటుంది. గురువారం సాయంత్రం కళాశాల బస్సులో భావన ఇంటికి వస్తున్న సమయంలో ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద బస్సు దిగి సాయికుమార్ ను కలిసింది.
కాగా భావన వద్ద ఉన్న సెల్ ఫోన్ సాయికుమార్ లాక్కొని చెక్ చేస్తున్నాడు. ఆ సమయంలో ఫోను లాక్కునే ప్రయత్నం చేసింది. దాంతో ఒక్కసారిగా భావనపై సాయికుమార్ కత్తితో దాడి చేశాడు. దాంతో ఆమె ఎడమచేతి చిటికెన వేలికి స్వల్ప గాయం అయింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని భావనను ఆసుపత్రికి తరలించారు. సాయికుమార్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
LATEST UPDATE :
-
Nelakondapalli : చెత్తకుప్పల నుంచి సొంత ఇంటికి.. పరిమళించిన మానవత్వం..!
-
Tomato Juice : తినడానికి బదులు టమోటా రసం తాగండి.. 30 రోజుల్లో ఈ 5 అద్భుతమైన ప్రయోజనాలు..!
-
NALGONDA : నల్గొండ జిల్లాలో ఎంపీడీవో, ఇద్దరు కార్యదర్శుల సస్పెన్షన్..!
-
Cm Revanth : నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. 35వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్..!









