Breaking Newsక్రైంజిల్లా వార్తలుమెదక్

గూగుల్, యూట్యూబ్ లలో సెర్చింగ్.. కట్ చేస్తే, పోలీసులకు చిక్కిన నిందితులు..!

గూగుల్, యూట్యూబ్ లలో సెర్చింగ్.. కట్ చేస్తే, పోలీసులకు చిక్కిన నిందితులు..!

టేక్మాల్, అక్టోబర్ 4, మన సాక్షి ప్రతినిధి:

ఉన్నత విద్యను అభ్యసించి ఉత్తమ పౌరులుగా జీవించాల్సిన యువకులు వ్యసనాలకు అలవాటుపడి అత్యాశకు పోయి అతి పురాతన విగ్రహాన్ని దొంగలించి కట కటాలా పాలైన సంఘటన టేక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వెయ్యేళ్ల చరిత్ర ఆనవాళ్లు కలిగిన జైనమత పార్శనాథ తీర్థంకర విగ్రహం లభ్యమైంది.

టేక్మాల్ మండలం లోని వేల్పుగొండ గ్రామంలోని తుంబురేశ్వరాలయ ప్రాంతంలో చెరువు మధ్యలో గల దేవతల గుట్ట లో చారిత్రక వార సత్వ సంపద కలిగిన జైనమత పార్శనాథ విగ్రహం కొలువై ఉంది. గతేడాది జూన్ 7వ తేదీన విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు అపహరిం చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. మళ్లీ ఈ సంవత్సరం ఆగస్టు 30న పార్శనాథుడి విగ్రహం అపహరణకు గురైందని గ్రామస్తులు జిల్లా ఎస్పీకి టేక్మాల్ ఎస్సైకి ఫిర్యాదు చేశారు.

ఈ విషయం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అల్లాదుర్గం సిఐ రేణుక రెడ్డి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ ముమ్మరం చేశారు. అనుమానం మానం వ్యక్తిని విచారించగా పెద్ద మొత్తంలో డబ్బులకు అమ్ముకున్నట్లు తెలిసింది. వారం రోజు లుగా విచారణలో నిమగ్నమైన హైదరాబాద్ లో ఎస్ఐ రాజేష్, ఇతర సిబ్బంది తో కలిసి నల్గొండ ప్రాంతలో దుండగులను పట్టుకొని విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం శుక్రవారం మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా ఆచంటకు చెందిన చిలుకురి అనువింద్, తోట జగత్, పెద్దపేటకు చెందిన బందెల శుభానంద్ , కృష్ణాజిల్లా నారాయణరావు నగర్ కు చెందిన పోలిశెట్టి తేజసాయిబాబు, కోటరెడ్డిపేటకు చెందిన జొన్నలగడ్డ మహేష్ బాబు లు బీటెక్ చదివి హైదరాబాద్లో కలిసి ఉంటున్నారు.

పురాతన విగ్రహాలను విక్రయించడం ద్వారా సులభంగా ఆధిక డబ్బులు, సంపాదించవచ్చనుకున్నారు. ఈజీ మనీ సంపాదించాలనే దురాశతో గూగుల్, యూట్యూబ్లో ఆదరణ లేకండా ఉన్న పురాతన దేవాలయాలు, విగ్రహాల గురించి వెతికారు.. అందులో టేక్మాల్ మండలం వెలుపుగొండ గుట్టపై జైన మతానికి చెందిన అతి పురాతన పార్శ్వనాథుడు తీర్థంకర విగ్రహం గురించి తెలిసింది.

దీంతో ఆ విగ్రహాన్ని అమ్మడం వల్ల అధికంగా డబ్బులు సంపాదించవచ్చనే నిర్ణయానికి వచ్చారు.విగ్రహాన్ని దొంగిలించడానికి అవసరమైన ప్రణాళికను రూపొందించుకున్నారు. జూలై 25 వ తేదీన అనువిన్ జగన్ వేల్పూగొండకు వచ్చి విగ్రహం ఉన్నచోట పరిశీలించి వెళ్లారు. మరుసటి రోజు 26 జూలై అర్ధరాత్రి ఐదుగురు యువకులు కొంత మంది సహాయంతో వాహనం తీసుకొని వేల్పుగొండకు వచ్చారు.

వారు అనుకున్నట్లుగా ఇక్కడి నుండి విగ్రహాన్ని అపహరించుకొని వెళ్లారు. అప్పటినుండి విగ్రహాన్ని అమ్మకానికి పెట్టిన ధర రాలేదు. అక్టోబర్ 4వ తేదీన విగ్రహాన్ని అమ్మకానికి ప్రయత్నం చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు అల్లాదుర్గం సిఐ రేణుక రెడ్డి టేక్మాల్ ఎస్సై రాజేష్ తన బృందంతో వెళ్లి వారిని పట్టుకున్నారు.

వారిని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి విచారణ చేయడంతోవిగ్రహాన్ని అపహరించినట్లు నేరాన్ని ఒప్పుకున్నారని ఎస్పీ ఉదయ్ కుమార్ తెలిపారు. పోలీసులు విగ్రహాన్ని స్వాధీనం చేసుకొని గ్రామస్తులకు అప్పజెప్పి, నేరస్థులను రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. విగ్రహాన్ని గ్రామస్తులకు అప్పగించినందుకు గ్రామ పెద్దలు పోలీస్ శాఖ సిబ్బందికి శాలువాలతో సత్కరించడం జరిగింది.

MOST READ :

మరిన్ని వార్తలు