Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

Miryalaguda : సన్న దాన్యం, దొడ్డు దాన్యం కొనుగోలుకు వేరు వేరు కేంద్రాల ఏర్పాటు..!

Miryalaguda : సన్న దాన్యం, దొడ్డు దాన్యం కొనుగోలుకు వేరు వేరు కేంద్రాల ఏర్పాటు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

రైతు సంక్షేమమే ధ్యేయంగా అధికార యంత్రాంగం పనిచేస్తుందని,రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా నిత్యం అందుబాటులో ఉండి పనిచేస్తామని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డివిజన్లో 74 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందులో 34 సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా, 40కేంద్రాలు ఐ కె పి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

వాటిలో సన్నధాన్యం కొనుగోలు కోసం 51, దొడ్డు ధాన్యం కొనుగోలు కోసం 23 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన తేమశాతం ప్రకారం ఏ గ్రేడ్ సన్నారకంధాన్యానికి క్వింటాల్ కు 2320 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2300 రూపాయలు చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుందని, సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాకు 500 రూపాయల చొప్పున బోనస్ కూడా చెల్లిస్తున్నట్లు తెలిపారు.

గతంలో జరిగిన ఇబ్బందులు పునరావృతం కాకుండా కొనుగోలు కేంద్రాలను మెరక ప్రాంతాలలో ఏర్పాటు చేయడంతో పాటు, వర్షానికి తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. గన్ని బ్యాగుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తల ఎత్తకుండా ప్రభుత్వ అంచనా ప్రకారం సగానికి పైగా అన్ని బ్యాగులు అన్ని కొనుగోలు కేంద్రాలకు చేర్చడం జరిగిందన్నారు.

ధాన్యం ఏరోజుకారోజు మిల్లుకు తరలించేందుకు లారీలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం పలు శాఖల ఆధ్వర్యంలో సరిహద్దు చెక్ పోస్టుల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ధాన్యానికి డబ్బులు చెల్లింపులలో ఆలస్యం జరగకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ముందుగానే రైతులు ధాన్యంతో పాటు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు వెంట తెచ్చుకుంటే త్వరగా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని అన్నారు. దేశంలోనే ధాన్యం కొనుగోలు కోసం మెరుగైన పద్ధతులు ఇక్కడ అమలు చేయడం జరుగుతుందన్నారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయన వెంట డి ఏ ఓ శ్రీనివాస్ శర్మ వున్నారు.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు