Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : నాగార్జునసాగర్ ఎడమ కాలువలో పడి యువకుడు మృతి..!

Miryalaguda : నాగార్జునసాగర్ ఎడమ కాలువలో పడి యువకుడు మృతి..!

మిర్యాలగూడ, ,మన సాక్షి :

నాగార్జునసాగర్ ఎడమ కాలువలో పడి యువకుడు మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లోని తక్కెళ్ళపాడు గ్రామపంచాయతీ పరిధిలో బండమీదిగూడెంలో చోటుచేసుకుంది.

రూరల్ ఎస్సై లోకేష్ తెలిపిన వివరాల ప్రకారం.. తక్కెళ్ళపాడు గ్రామపంచాయతీ పరిధిలోని బండమీదిగూడెంకు చెందిన నారబోయిన హరికృష్ణ (36) పెద్దదేవులపల్లిలోని రెడ్డిస్ లేబరేటరీలో పనిచేస్తాడు.

రోజు మాదిరిగానే టీవీఎస్ ఎక్సెల్ పై గురువారం వెళ్ళిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో శుక్రవారం అతని తండ్రి వెంకటయ్య ఫిర్యాదు చేశారు. వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహించారు. కాల్వకట్టపై చెప్పులు లభ్యం కావడంతో ఎడమకాలంలో పడిండని విచారణ చేసినట్లు తెలిపారు.

కాగా శుక్రవారం ఉదయం నేరేడుచర్ల మండలంలోని మేడారం సమీపంలో హరికృష్ణ మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు