Indiramma Bharosa : భూమిలేని వారికి ఏటా రూ.12 వేలు.. మీరూ అర్హులేనా.. నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన..!
Indiramma Bharosa : భూమిలేని వారికి ఏటా రూ.12 వేలు.. మీరూ అర్హులేనా.. నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో భూమిలేని రైతు కూలీలకు రేవంత్ సర్కార్ కొత్త పథకాన్ని అమలు చేయబోతుంది. ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. భూమిలేని రైతు కూలీలకు ఏటా 12 వేల రూపాయలను అందజేసే ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా నామకరణం చేశారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రైతు కూలీలకు భరోసా కల్పించే విధంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
అయితే వీరిని ఎలా ఎంపిక చేస్తారనే విషయంపై సందిగ్ధంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వం మార్గదర్శకాల ఆధారంగా గ్రామాలలో జనవరి 16వ తేదీ నుంచి క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. జనవరి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హుల జాబితాను తయారు చేయనున్నారు.
జనవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలలో జాబితాను ప్రదర్శించి, సభలోనే అర్హులను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత జనవరి 26వ తేదీ నుంచి అర్హులైన వారి ఖాతాలలో ప్రభుత్వం డబ్బులు జమ చేయనున్నది.
అయితే ఇప్పటివరకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి దరఖాస్తులు స్వీకరించలేదు.. కానీ అధికారులు జనవరి 16వ తేదీ నుంచి క్షేత్రస్థాయి పరిశీలన ఎలా చేస్తారంటే.. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఉండి, కనీసం 20 రోజులు పని దినాలకు హాజరై ఎలాంటి భూమి లేని వారిని ఈ పథకానికి ఎంపిక చేయనున్నారు. ఈ మార్గదర్శకాలపై గ్రామాలలో పరిశీలన చేపడుతున్నారు.
MOST READ :
-
Viral Video : సైలెంట్ గా నిలబడిన కోడి.. పందెంలో గెలిచింది.. (వీడియో వైరల్)
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుకు అర్హతలు.. నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు వారిని అనర్హులుగా గుర్తించాలి.. జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం..!
-
Railway Jobs : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!
-
Gold Price : పసిడి ధర మళ్లీ పెరిగింది.. ఈరోజు తులం ఎంతంటే..?









