After 30 Years : 30 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక..!
After 30 Years : 30 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక..!
రామసముద్రం, మనసాక్షి
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రంలోని చెంబకూరు జడ్పీ హైస్కూల్ 2004-05 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులంతా ఒకచోట కలుసుకొని ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకొని తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
రాబోయే రోజుల్లో ఒకరికొకరం అండగా ఉండాలని తీర్మానం చేసుకున్నారు. అనంతరం పిల్లా పాపలతో కలిసి పాఠశాల ఆవరణలో ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాటు పూర్వ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ఉపాధ్యాయులను విద్యార్థులు దూశాలవాలతో ఘనంగా సన్మానించారు.
పూర్వ విద్యార్థులు 2004 2005 బ్యాచ్ తో షీల్డ్ ఉపాధ్యాయులకు బహుమతిగా అందించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ఆశీర్వదించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ,మా విద్యార్థులతో కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
అంతేకాకుండా ఈరోజు జీవితంలో మర్చిపోలేని రోజు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం. శంకరప్ప, ఉపాధ్యాయులు జయచంద్ర రెడ్డి, అనంత వేణుగోపాల చారి, చంద్రశేఖర్ నాయుడు, బాలసుబ్రమణ్యం, చిన్నప్ప హరినాథ్, మాధవి, హంస వేణి, పూర్వ విద్యార్థులు, పాల్గొన్నారు.
MOST READ :
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లావాదేవీల పరిమితి ఎంత.. పెంచుకోవచ్చా.. తెలుసుకుందాం..!
-
Balkonda : దక్షిణ భారతంలోనే అత్యంత ప్రాచీనమైన అల్లకొండ (బాల్కొండ).. ఘనమైన చరిత్ర తెలుసుకుందాం..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు మూడు జాబితాలు.. అవేంటో తెలుసా.. ఇలా చెక్ చేసుకోండి..!
-
Nagarjunasagar : అప్పుడే ఖాళీ అవుతున్న సాగర్ జలాశయం.. ఎన్ని అడుగుల నీరుందో తెలుసా..!









