Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsfoodజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Chicken Mela : ఫ్రీ చికెన్ మేళ.. ఎగబడ్డ మాంసం ప్రియులు..!

Chicken Mela : ఫ్రీ చికెన్ మేళ.. ఎగబడ్డ మాంసం ప్రియులు..!

సూర్యాపేట, మనసాక్షి:

సూర్యాపేటలో తాళ్లగడ్డలో నిర్వహించిన ఉచిత చికెన్, ఎగ్ మేళాకు జనం అధిక సంఖ్యలో పోటెత్తారు. బ్లడ్ ప్లూ వ్యాధిపై ఉన్న అపోహలు తొలగించేందుకు ఓ వెన్ కబ్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత చికెన్ మేళా నిర్వహించారు.

ఇందులో భాగంగా 200 కిలోల చికెన్, 2 వేల కోడిగుడ్లను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ సోకుతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుండటంతో ప్రజల్లో ఆన్న అపోహలు పోగొట్టేందుకు చికెన్, ఎగ్ మేళా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

వెన్కాబ్ నల్గొండ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాసరావు అశోక్ కుమార్ 27, 28 వార్డు మాజీ కౌన్సిలర్లు చిరువెళ్ళ లక్ష్మీకాంతమ్మ-వెంకటేశ్వర్లు, రాపర్తి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అంజద్ అలి, కాంగ్రెస్ నాయకులు చిరివెళ్ళ శబరి నాథ్ , చికెన్ షాప్ నిర్వాహకులు శేఖర్ రెడ్డి, బాపురావు తదితరులు ఉన్నారు.

MOST READ : 

  1. KCR : కేసీఆర్ ఇంటర్నెట్ – జిరాక్స్ సెంటర్ ప్రారంభం..!

  2. Holidays : వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రతి నెలా నాలుగో శనివారం సెలవు.. వారికి ఇవ్వాల్సిందే..!

  3. BIG BREAKING : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ ను ఢీ కొట్టిన బస్సు..!

  4. District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఆ ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్..!

  5. District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. మధ్యాహ్నం భోజనం ఏజెన్సీ పై క్రమశిక్షణ చర్యలకు ఆదేశం..!

మరిన్ని వార్తలు