Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణ

Rythu Bharosa : రైతు భరోసా పై కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్. !

Rythu Bharosa : రైతు భరోసా పై కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్. !

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రైతు భరోసా పథకం అయోమయంగా మారింది. రైతులకు పంటల పెట్టుబడి సమయంలో ఇవ్వాల్సిన సహాయం ఇప్పటివరకు అందలేదు. కాంగ్రెస్ సర్కారు వచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ రైతు భరోసా పథకం పూర్తిస్థాయిలో అందలేదు.

ఎన్నికల సమయంలో ఎకరానికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం రైతు భరోసా ద్వారా అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాగా 2025 జనవరి 26వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించారు. యాసంగి పంటల రైతులకు ఎకరానికి 6000 రూపాయల చొప్పున అందజేస్తామని తెలిపారు.

ఇప్పటివరకు మూడు విడతలుగా మూడు ఎకరాల లోపు రైతులకు మాత్రమే పంట పెట్టుబడి సహాయాన్ని అందజేశారు. మిగతా రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. కాగా వారికి మరో వారం రోజుల్లో నాలుగు ఎకరాల లోపు రైతులకు భరోసా అందజేస్తామని అధికారులు పేర్కొన్నారు.

సాగుకు యోగ్యం కానీ భూములను బ్లాక్ లిస్టులో పెట్టడం వల్ల అర్హులైన వారికి కూడా రైతు భరోసా చాలామందికి రాలేదు. దాంతో రైతు భరోసా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అయినా వారికి కూడా రైతు భరోసా ఇంకా అందలేదు. నాలుగు ఎకరాల లోపు రైతు భరోసా సహాయం రోజుల్లో అందజేస్తామని ప్రకటనతో రైతులు ఎదురుచూస్తున్నారు.

MOST READ :

  1. Fake Dsp : నకిలీ డి.ఎస్.పి.. ఇదో పెద్ద కథ.. అరెస్టు చేసిన పోలీసులు..!

  2. Runa Mafi : ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారికి రూ.10 లక్షల భీమా, రుణమాఫీ నిధులు మంజూరు..!

  3. Ruthu Bharosa : రైతు భరోసా పై కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!

  4. Ration Cards : రేషన్ కార్డులపై బిగ్ ట్విస్ట్.. లేటెస్ట్ అప్డేట్..!

  5. TG News : తెలంగాణలో మహిళలకు కుటుంబ భరోసా కు రూ.10 లక్షలు.. మంత్రి సీతక్క కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు