Hyderabad : వారికి ఊరే సరి.. దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!

Hyderabad : వారికి ఊరే సరి.. దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!
మన సాక్షి, హైదరాబాద్ :
సంచలనం కలిగించిన హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో వారికి ఉరిశిక్ష సరైనదని హైకోర్టు తీర్పు వెలువరించింది. మంగళవారం హైకోర్టులో దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురు వ్యక్తులకు (యాసిన్ బత్కల్ అసదుల్లా అక్తర్, రెహమాన్, యజాజ్ షేక్, తహసన్ అత్తర్) ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
గతంలో NIA ( నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంఘటన 2013 ఫిబ్రవరి 21న దిల్ సుఖ్ నగర్ లో రెండు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ బాంబు పేలుళ్లలో 18 మంది మృతి చెందగా 131 మంది అంగవైకల్యం అయ్యారు.
అప్పట్లో సంచలనం కలిగించిన ఈ బాంబు పేలుళ్ల కేసులో ఆరుగురు నిందితులు ఉండగా ఏ వన్ నిందితుడు రియాజ్ బత్కల్ ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. మిగతా ఐదుగురికి 2016లో NIA ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది. కాగా వారు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో హైకోర్టు మంగళవారం తుది తీర్పును ప్రకటించింది. ఐదుగురు నిందితులకు కూడా ఉరిశిక్ష సరైనదంటూ తీర్పు విలువరించింది.
ఇదిలా ఉండగా ఉరిశిక్ష ఎప్పుడు అనేది నిర్ణయం కాకపోవడంతో నిందితులు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు నిందితుల తరఫున న్యాయవాది పేర్కొన్నారు.
MOST READ :
-
Axis Bank: యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులకు అలర్ట్.. ఓటీపీ మోసాలకు ఇక చెక్..!
-
Banks : బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 10 లోగా ఇది చేయకుంటే మీ ఎకౌంటు క్లోజ్..!
-
Nalgonda : ఈ ముఠా మామూలోళ్లు కాదు.. తోటలో కల్తీ మద్యం తయారీ.. బ్రాండెడ్ పేరుతో విక్రయం..!
-
District collector : రాంపూర్ లో దుర్గ రాజు ఇంట్లో జిల్లా కలెక్టర్ భోజనం..!
-
Video : కామంతో కళ్ళు మూసుకుపోయి.. నడిరోడ్డుపై.. (వీడియో)









