Uttam Kumar Reddy : కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం..!
Uttam Kumar Reddy : కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం..!
- గత పాలకుల తీరుతో పదేళ్లు కృష్ణ నది జలాల పంపకాలలో తెలంగాణ కి అన్యాయం జరిగింది…
- మూడు లిప్ట్ ఇరిగేషన్ ల ద్వారా 71000 ఎకరాలకి సాగు నీరు…..
- ఇరిగేషన్ స్కీం లలో భూ సేకరణచెసిన వెంటనే నష్ట పరిహారం….
- చింతలపాలేం మండలం లో మూడు లిప్ట్ ఇరిగేషన్ స్కీం లకి భూ సేకరణ జులై నాటికి పూర్తి చేయాలి…..
- ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ కి ఇందిరా గాంధీ ఎత్తిపోతల పథకం గా నామ కరణం…….
రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట, మనసాక్షి :
కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం చింతలపాలెం మండలం అంజలి సిమెంట్ ఆడిటోరియం లో రాజీవ్ గాంధీ లిప్ట్ ఇరిగేషన్ స్కీం,ముక్త్యాల బ్రాంచ్ కెనాల్,నక్క గూడెం లిప్ట్ ఇరిగేషన్ స్కీం ల పనుల పురోగతి పై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కృష్ణా నది జలాల పంపకం లో బ్రిజేష్ ట్రిబ్యునల్ పై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తో దక్షిణ తెలంగాణా ఎడారి లాగా మారిందని తెలిపారు. తెలుగురాష్ట్రాలకి 811 టి యమ్ సి లు కేటాయించగా 512 టి యమ్ సి(66%) లు ఆంధ్రకి 299 టి యమ్ సి లు (34%) తెలంగాణ కి అని జరిగిన లిఖిత పూర్వక ఒప్పందంపై గత పాలకులు ఒప్పుకొని తెలంగాణకి తీవ్ర అన్యాయం చేసారని మన ప్రజా ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రిగా నేను నిపుణులు, న్యాయ కోవిద్దుల సలహాలు తీసుకొని కృష్ణ జలాల పంపకం లో 70 % తెలంగాణకి తీసుకొచ్చేలా కేసు రిఓపెన్ చేపించి ట్రేబ్యునల్ కి ఇరిగేషన్ మంత్రిగా స్వయంగా హాజరై వాదనలు వినిపిస్తున్నామని తెలిపారు.
పాలమూరు -రంగారెడ్డి కి కృష్ణ జలాలలో నీరు కేటాయించకపోయినా గత ప్రభుత్వం నిషబ్దంగా ఉందని మేము వచ్చాక నీటి కేటాయింపు కోసం పోరాడుతున్నామని తెలిపారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 38,000 కోట్లతో తుమ్మడి హట్టి వద్ద డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవ్వెళ్ల ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టగా దానిని రద్దు చేసి మెడిగడ్డ పదేళ్లు కాళేశ్వరం పేరుతో కాలయాపన చేస్తూ లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందని అవే నిదులతో కృష్ణ నది పై భీమా, నెత్తంపాడు, కోయిల సాగర్, కల్వకుర్తి, డిండి, ఎస్ ఎల్ బి సి టన్నెల్ అలాగే గోదావరి పై దేవదుల, సీతారామ ప్రాజెక్టు లు పూర్తి అయ్యేవని మంత్రి తెలిపారు.
నక్కగూడెం లిప్ట్ ఇరిగేషన్ పై మాట్లాడుతూ 2008 లో పనులు మొదలు పెట్టి 2012 లో పూర్తి చేసి రైతులకి సాగునీరు అందజేసామని 2018 నుండి మరమ్మత్తులు చేపించకుండా పక్కన పెట్టడంతో రైతులు ఇబ్బంది పడ్డారని మరల మన ప్రభుత్వం హయాంలో 37.70 కోట్ల రూపాయలతో నక్కగూడెం, చింత్రియాల, కిష్టపురం, తమ్మారం 3200 ఎకరాలు సాగులోకి వస్తుందని 2025 ఆగస్టు నాటికి పూర్తి చేయాలనీ ఆదేశించారు. భూమికింద వేసిన పైపులు కి కుడా రైతులకి నష్ట పరిహారం ఇచ్చామని తెలిపారు.
ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిప్ట్ ఇరిగేషన్ స్కీంకి ఇందిరాగాంధీ ఎత్తిపోతల పథకం గా నామకారణం చేయటం జరిగిందని ఈ స్కీం ద్వారా 1450 కోట్ల రూపాయలతో మఠంపల్లి మండలంలో 20500 ఎకరాలు,మేళ్లచెర్వు మండలంలో 15800 ఎకరాలు, చింతలపాలెం మండలంలో 16700 ఎకరాలు మొత్తం 53000 ఎకరాలు సాగు లోకి తీసుకొని రావటం జరుగుతుందని 2026 ఆగస్టు నాటికో పూర్తి చేయాలనీ కాంట్రాక్టర్ ని ఆదేశించారు.ఈ ప్రాజెక్ట్ ద్వారా నాగార్జున సాగర్ లో నీరు లేకపోయినా కృష్ణ నది నుండి నీరు ముక్త్యాల కాల్వలో నీరు ఎత్తిపోసి రైతులకి సాగు నీరు అందించటం జరుగుతుందని తెలిపారు.
రాజీవ్ గాంధీ లిప్ట్ ఇరిగేషన్ స్కీం ను 394 కోట్ల రూపాయలతో మేళ్లచెర్వు, కోదాడ, హుజూర్ నగర్, చింతలపాలెం, చిలుకూరు మండలాల పరిధిలోని 12 గ్రామాలకి చెందిన 14100 ఎకరాలు సాగులోకి తేవటం జరుగుతుందని 2026 మే నాటికి పూర్తి చేసి అందుబాటులో కి తేవాలని కాంట్రాక్టర్ ని ఆదేశించారు.ఈ మూడు స్కీం ల్ ద్వారా 71000 ఎకరాలు సాగులోకి రావటం జరుగుతుందని అన్నారు.
రాష్ట్రంలో ఎక్కడైనా ఇరిగేషన్ పథకాలకి సంబంధించి భూ సేకరణ చేస్తే రైతు కి న్యాయ బద్దంగా వెంటనే నష్ట పరిహారం అందజేయటం జరుగుతుందని తెలిపారు.ఈ మూడు లిప్ట్ ఇరిగేషన్ లకి సంబంధించి భూ సేకరణకి రైతులు సహకరించాలని, స్థానిక ప్రజా ప్రతి నిధులు కుడా ప్రజలకి తెలియజేయాలనీ సూచించారు.పెండింగ్ లో ఉన్న భూ సేకరణ పనులు పూర్తి చేయాలనీ కలెక్టర్ ని, ఆర్థివో లకి తెలిపారు.ఎక్కడైనా లిప్ట్ ఇరిగేషన్ లకి మరమ్మత్తులు ఉంటే అధికారులకి తెలియజేయాలనీ సూచించారు.
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ లిప్ట్ ఇరిగేషన్ స్కీం లకి సంబంధించిన రైతుల నుండి భూ సేకరణ పనులు పూర్తి చేసి , నష్టపరిహారం అందజేసి ఇరిగెషన్ అధికారులకు అందజేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్థివో శ్రీనివాసులు,ఇరిగేషన్ సి ఈ రమేష్ బాబు, ఎస్ ఈ శివ ధర్మ తేజ, డి ఈ లు చారి, హరి కిషోర్, తహసీల్దార్ సురేందర్ రెడ్డి, ఎంపిడిఓ భూపాల్ రెడ్డి,అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
MOST READ ;
-
Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కు తప్పిన పెను ప్రమాదం..!
-
Komatireddy Venkatreddy : రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!
-
Gold Price : మళ్లీ కొండెక్కిన బంగారం.. ఒక్కరోజే రూ 24,000..!
-
Miryalaguda : మీ ప్రాంతంలో విద్యుత్ సమస్యలు వస్తే.. ఇవిగో కొత్త ఫోన్ నెంబర్లు..!
-
Miryalaguda : వ్యవసాయ అధికారుల ఫోన్ నెంబర్లు మార్పు.. ఇవీ నెంబర్లు..!
-
District collector : జిల్లా కలెక్టర్ మిల్లర్లకు కీలక ఆదేశాలు.. ధాన్యo దిగుమతి వేగవంతం చేయాలి..!









