Viral Video : తిరుపతి సన్నిధిలో అపచారం.. ఇదేం పాడుపని.. వైరల్ వీడియో..!
Viral Video : తిరుపతి సన్నిధిలో అపచారం.. ఇదేం పాడుపని.. వైరల్ వీడియో..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడిని కలియుగ దైవంగా కొలుస్తారు. నిత్య కళ్యాణం.. పచ్చ తోరణం.. ఇక్కడికి ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు వెంకటేశ్వరని దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా తమిళనాడు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, ఒరిస్సా తో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా పలు దేశాల నుంచి తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడిని దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు.
పవిత్ర పుణ్యక్షేత్రంలో ఒక యువకుడు మద్యం తాగుతూ పాడుపని చేశాడు. తిరుపతి నుంచి తిరుమల కు భక్తులు వెళ్లే మెట్ల మార్గం వద్ద మద్యం తాగినట్లు వీడియోలు ఉన్న సమాచారం మేరకు తెలుస్తుంది. మద్యం తాగిన బాటిల్ కూడా మెట్లపై వేసినట్లు వీడియోలో తెలుస్తుంది. కాగా ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల నెట్టింట్లో వైరల్ గా మారింది. పలువురు నేటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ వీడియోను కావాలనే ఎవరైనా పెట్టారా..? లేక నిజమేనా..? అనే విషయం తెలియాల్సి ఉంది.
తిరుమలలో మరొక అపచారం .. తిరుమలని కూడా వదలని మందు బాబులు !
శ్రీవారి సన్నిధిలో మద్యం తాగుతున్న మందు బాబులు
మందు తాగేసి బాటిల్స్‌ను మెట్లపై విసురుతున్న మందు బాబులు
కూటమి ప్రభుత్వంలో రోజురోజుకు దిగజారుతున్న తిరుమల ప్రతిష్ట pic.twitter.com/BcT7K3Mifu
— Vizag – The City Of Destiny (@Justice_4Vizag) June 8, 2025









