Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లా

Indiramma Indlu : అర్హులకు దక్కని ఇందిరమ్మ ఇండ్లు..!

Indiramma Indlu : అర్హులకు దక్కని ఇందిరమ్మ ఇండ్లు..!

చర్ల, మనసాక్షి:

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పధకం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,చర్ల మండల నిరుపేద ప్రజలకు సగానికి సగం మందికి అందని ద్రాక్షగా మారింది. సర్కార్ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ చర్ల లో ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక నిజమైన నిరుపేదకు దక్కకుండా పక్కాగా ఇండ్లు ఉన్న వారిని ఎంపిక చేసి తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది.

ఒకపక్క తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని,ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రతి పేదవాడు ఈ పథకంలో లబ్ధి పొందాలని లక్ష్యం తో ప్రభుత్వం ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ కమిటీలను వేసుకొని ఇంటింటి సర్వే నిర్వహించాలని పకడ్బందీ సమాచారంతో నిజమైన నిరుపేదలను గుర్తించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లను ఎంపిక చేస్తే స్థానిక అధికారులపై సస్పెండ్ వేటు తప్పదని అనర్హులకు ఎంపిక చేసిన ఇండ్లను కచ్చితంగా మధ్యలోనే నిర్మాణాలను నిలుపుదల చేస్తామని తేల్చి చెప్పింది.ఐనప్పటికి ఇందుకు పూర్తి వ్యతిరేకంగా చర్ల మండలంలోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మొదటి దఫాలో ఎంపికచేయకుండా పకడ్బందీగా ఇండ్లు ఉన్నవారికి, కార్లు ఉన్నవాళ్లకి, బంగలాల వున్నవాళ్ళకు ఎంపిక చేయడం జరిగింది.

ఇది దుర్మాగం.ఇందిరమ్మ గ్రామ కమిటీ వారు చేసిన తప్పుడు సర్వే వలన నిజమైన అర్హులు నష్టపోయారు.దీనితో బాధిత నిరుపేద ప్రజల సొంతింటి కల కలగానే మిగిలిపోయింది. ఇందిరమ్మ ఇండ్ల సంక్షేమ పథకానికి చర్ల మండలంలోని నిజమైన నిరుపేదలు అర్హులు కారా అని బాధిత నిరుపేదలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

ఈ ప్రభుత్వానికి మా నుండి వచ్చే ఓట్ల మీద ఉన్న షార్ధ మా బ్రతుకుల మీద మా పిల్లల భవిష్యత్తు మీద లేదని ఆశ్చర్యపడ్డారు. సొమ్ము ఒకడిదైతే సోకొకడిది అన్న చందంగా ఇందిరమ్మ ఇండ్లఎంపికలు చర్లలో ఉన్నాయని హితావు పలికారు. ఇదేనా ప్రభుత్వం యొక్క లక్ష్యం అని అన్నారు.తక్షణమే తప్పుడు రిపోర్ట్ ను రద్దు చేసి రీ సర్వే నిర్వహించి నిజమైన నిరుపేదలను గుర్తించి మాకు న్యాయం చేయగలరని బాధిత ప్రజానీకం వేడుకుంటున్నారు.

గుడిసెలలో ఉంటున్నాము: 

ఉదయగిరివశమతి, లెయ్యమ్మలు : 

ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల కాలంలో ఇందిరమ్మ ఇండ్ల సంక్షేమ పథకం చేపట్టడం జరిగింది. సొంత ఇల్లు లేని మాకు ఈ పథకం నిజమైన నిరుపేదల కోసమే అని ప్రభుత్వం బహిర్గతం చేయడం పట్ల నిరుపేదలమైన మాకు ఇందిరమ్మ ఇల్లు కచ్చితంగా వస్తాయని ఎంతో ఆశ పడ్డాము.

ఈ పథకంతో సొంత ఇల్లు లేని మాకు (మా సొంత) ఇంటి కల నెరవేరినట్టేనని ఎంతో ఆనందపడ్డాము. కానీ ఇందిరమ్మ గ్రామ కమిటీ వారు చేసిన తప్పుడు సర్వే వలన మా సొంత ఇంటి కల కలగానే మిగిలిపోయింది. తక్షణమే రీసర్వే నిర్వహించి నిజమైన నిరుపేదలను గుర్తించి మాకు ఇందిరమ్మ ఇండ్లను ఎంపిక చేసి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని మా బ్రతుకుల్లో వెలుగులు నింపాలని కోరుతున్నాము.

నిరుపేదలకే ఇండ్లు ఇచ్చాము : 

కనపర్తిఈదయ్య యం పీ డి ఓ చర్ల : 

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల కాలంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సంక్షేమ పథకం అర్హులైన ప్రతి ఒక్క నిరుపేదలకు చేరుతుందని ఎవరు అధ్యర్య పడొద్దని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లను ప్రతి నియోజకవర్గానికి 4500 ఇండ్ల చొప్పున కేటాయించారని అందులో ఒక చర్ల మండలానికి సుమారుగా 800 ఇండ్లను కేటాయించగా ఈ ప్రాంతంలో ఎక్కువ నిరుపేదలు ఉండడంతో కాంపిటేషన్ ఎక్కువగా ఉందని అందువలనే ఈ మొదటి విడతలో కొందరు నిరుపేదలకు ఆ ఇండ్లు ఎంపిక చెయ్యలేకపోయామని తెలిపారు.

ప్రభుత్వం మూడు విడతలుగా ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక చేస్తుందని నిరుపేద ప్రజలు ఎవరూ కూడా నీరస చెందాల్సిన అవసరం లేదని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక కచ్చితంగా చేస్తామని తమ సొంతింటి కలను నెరవేరుస్తామని అన్నారు.తద్వారా ప్రభుత్వ లక్ష్యం దిశగా అడుగులు వేస్తాం అని తెలిపారు.

MOST READ : 

  1. Miryalaguda : మిర్యాలగూడలో ఘరానా మోసం.. లక్కీ డ్రా పేరుతో రూ.3.90 కోట్లు స్వాహా.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు..!

  2. Ration Cards : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై వారికి రేషన్ కట్..!

  3. Rythu : ఆ రైతులకు డబుల్ బోనాంజా.. ఎకౌంట్లో రూ.20 వేలు..!

  4. TG News : భారీగా తగ్గనున్న ఎంపిటిసి స్థానాలు.. స్థానిక సంస్థల లేటెస్ట్ అప్డేట్..!

  5. Agriculture : వ్యవసాయ రంగంలో AI టెక్నాలజీ.. రైతులకు ఇక పండుగ..!

 

మరిన్ని వార్తలు