సెబీకి డీఆర్‌హెచ్‌పీ సమర్పించిన ఆమ్నిటెక్ ఇంజినీరింగ్ లిమిటెడ్
సెబీకి డీఆర్‌హెచ్‌పీ సమర్పించిన ఆమ్నిటెక్ ఇంజినీరింగ్ లిమిటెడ్
పపమన సాక్షి:
ప్రెసిషన్-ఇంజినీర్డ్ పరికరాల తయారీ సంస్థ ఆమ్నిటెక్ ఇంజినీరింగ్ తమ రూ. 850 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కి (ఐపీవో) సంబంధించి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను (డీఆర్‌హెచ్‌పీ) క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. తాజాగా షేర్ల జారీ మరియు ఆఫర్ ఫర్ సేల్ విధానంలో (ఓఎఫ్ఎస్) ప్రమోటర్లు షేర్లను విక్రయించడం రూపంలో ఈ ఐపీవో ఉంటుంది. రూ. 520 కోట్ల వరకు విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా ప్రమోటర్ ఉదయ్ కుమార్ అరుణ్ కుమార్ పరేఖ్ రూ. 330 కోట్ల విలువ చేసే షేర్లను ఓఎఫ్ఎస్ కింద విక్రయించనున్నారు.
ప్రీ-ఐపీవో ప్లేస్మెంట్ కింద రూ. 104 కోట్ల సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇది విజయవంతమైతే, తాజాగా జారీ చేసే షేర్ల పరిమాణం తగ్గుతుంది. కొత్తగా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధులను రుణాల చెల్లింపు, కొత్తగా రెండు తయారీ ప్లాంట్ల ఏర్పాటు, మూలధన వ్యయాల అవసరాలు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో షేర్లు లిస్ట్ చేయబడతాయి.
ఓమ్నిటెక్ ఇంజినీరింగ్ సంస్థ అత్యంత నైపుణ్యంతో కూడిన ఇంజినీరింగ్ కాంపొనెంట్లను తయారు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఖాతాదారులకు సరఫరా చేస్తోంది. ఇవి ఇంధనం, మోషన్ కంట్రోల్ & ఆటోమేషన్, ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ సిస్టమ్స్ మరియు ఇతరత్రా పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించబడుతున్నాయి.
హాలీబర్టన్ ఎనర్జీ సర్వీసెస్, సుజ్లాన్, ఓష్కోష్ ఏరోటెక్, వెదర్‌ఫోర్డ్, లఫ్కిన్ ఇండస్ట్రీస్ (Lufkin Industries), ఆయిల్గేర్, డొనాల్డ్సన్ కంపెనీ, పుష్ ఇండస్ట్రీస్, భారత్ ఏరోస్పేస్ మెటల్స్ వంటి ప్రముఖ సంస్థలు, ఈ కంపెనీకి క్లయింట్లుగా ఉన్నాయి. అమెరికా, యూఏఈ, జర్మనీ, బల్గేరియా, స్వీడన్ తదితర 22 దేశాల్లోని 220 పైచిలుకు కస్టమర్లకు కంపెనీ తమ ఉత్పత్తులను సరఫరా చేసింది.
ఈ ఇష్యూకి ఈక్విరస్ క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సంస్థలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా, MUFG ఇన్‌టైమ్ ఇండియా (గతంలో లింక్ ఇన్‌టైమ్ ఇండియా) రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తోంది.
MOST READ :
-
Drinking water : ఈ ప్రాంతంలోని 245 గ్రామాలు, 3 మున్సిపాలిటీలలో 36 గంటలు త్రాగునీరు బంద్..!
-
TG News : బోనాల పండుగ వేళ.. ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్..!
-
Railway Track : తెలంగాణలో రైలు పట్టాలపై కారుతో యువతి హల్చల్.. (వీడియో)
-
Teacher : ఉపాధ్యాయులకే ఆమె ఆదర్శం.. ఎందుకో, ఏంటో.. తెలుసుకోవాల్సిందే..!









