Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుహైదరాబాద్

Hyderabad : హైదరాబాద్‌లో క్యారట్‌లేన్‌ నూతన షోరూం ప్రారంభం.. ఇక్కడ వజ్రాలపై 30% రాయితీ..!

Hyderabad : హైదరాబాద్‌లో క్యారట్‌లేన్‌ నూతన షోరూం ప్రారంభం.. ఇక్కడ వజ్రాలపై 30% రాయితీ..!

హైదరాబాద్‌, మన సాక్షి :

ప్రముఖ ఆభరణాల బ్రాండ్‌ క్యారట్‌లేన్‌, హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో తన సరికొత్త స్టోర్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఇది 329వ స్టోర్‌ కాగా, హైదరాబాద్‌లో 19వది. సువిశాలమైన 1400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ షోరూంలో అధునాతన డిజైన్లతో కూడిన ఆభరణాల కలెక్షన్లను అందుబాటులోకి తెచ్చారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి క్యారట్‌లేన్‌ రీజినల్‌ మేనేజర్‌ నవదీప్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి, తమ వ్యాపార భాగస్వాములు మల్లికార్జున్‌, సీతారామ్‌లతో కలిసి స్టోర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా, క్యారట్‌లేన్‌ వజ్రాభరణాలపై 30 శాతం భారీ రాయితీని ప్రకటించింది.

ఈ ప్రత్యేక ఆఫర్‌ జులై 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. నాణ్యమైన వజ్రాలను సరసమైన ధరల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని క్యారట్‌లేన్‌ తెలియజేసింది.

MOST READ : 

  1. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో బ్యాలెన్స్ చెక్ చేసే అలవాటు మీకు ఉందా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

  2. Gold Price : గోల్డ్ రేట్ మళ్లీ హైక్.. ఈరోజు తులం ఎంతంటే..!

  3. Nagarjunasagar : నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద.. పెరుగుతున్న నీటిమట్టం.. లేటెస్ట్ అప్డేట్..!

  4. ACB : రైతు నుంచి రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఎసిబికి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్..!

మరిన్ని వార్తలు