జాతీయంBreaking Newsవిద్య

Holiday : రేపు స్కూళ్లు, కార్యాలయాలకు సెలవు.. తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు..!

Holiday : రేపు స్కూళ్లు, కార్యాలయాలకు సెలవు.. తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

రేపు 2025 జూలై 31వ తేదీ ప్రభుత్వం హాలిడే ప్రకటించింది. హాలిడే సందర్భంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా సెలవు పాటించనున్నాయి. రేపు గురువారం జులై 31వ తేదీన సెలవు ఎందుకు ప్రకటించారనే విషయం తెలుసుకుందాం..

స్వాతంత్ర సమరయోధుడు షాహిద్ ఉదమ్ సింగ్ సంస్మరణార్థం ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఇతడు పంజాబ్ లో 1899లో జన్మించారు. జలియన్ వాలాబాగ్ మరణకాండకు కారణమైన జనరల్ డయ్యర్ ను చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు. అందుకు గాను ఉదమ్ సింగ్ ను లండన్ లోని జైల్లో 1940 జూలై 31వ తేదీన ఉరి తీశారు.

అప్పటినుంచి పంజాబ్ లో జులై 31 వ తేదీన ప్రభుత్వం సెలవును ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలు కూడా సెలవు పాటించనున్నాయి.

అదే విధంగా ఆగస్టు నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కాలేజీలకు, పాఠశాలలకు సెలవులు రానున్నాయి. ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతం, శనివారం 9వ తేదీన రాఖీ పౌర్ణమి సందర్భంగా సెలవులు వస్తుండగా మరుసటి రోజు ఆదివారం 10వ తేదీన సెలవులు రానున్నాయి. వరుసగా మూడు రోజులపాటు సెలవులు రానున్నాయి.

అదేవిధంగా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం శుక్రవారం వస్తున్నందున మరుసటి రోజు శనివారం ఒక్కరోజు మినహా ఆగస్టు 17వ తేదీన కూడా ఆదివారం సెలవు రానున్నది.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. ప్రజలను అలా భయభ్రాంతులకు గురి చేస్తే చర్యలు..!

  2. Liquor Scam : లిక్కర్ కుంభకోణంలో కీలక మలుపు.. తెలంగాణలో రూ.11 కోట్లు స్వాధీనం..!

  3. Nagarjunasagar : నాగార్జునసాగర్ గేట్లు ఓపెన్.. ఇక పర్యాటకుల సందడి.. ( వీడియో)

  4. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. వాట్సాప్ లో ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం..!

  5. TGSRTC : తెలంగాణ ఆర్టీసీ భారీ గుడ్‌ న్యూస్.. ఆ రూట్లలో బస్ టికెట్ల ధరలపై రాయితీ..!

మరిన్ని వార్తలు