Heavy Rain : మంజీరా వరదలో చిక్కిన నలుగురు.. డ్రోన్లతో పోలీసుల పరిశీలన..!
Heavy Rain : మంజీరా వరదలో చిక్కిన నలుగురు.. డ్రోన్లతో పోలీసుల పరిశీలన..!
కోటగిరి, మన సాక్షి :
భారీ వర్షాల నేపథ్యంలో మంజీరా లో నలుగురు వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం అందించడంతో అప్రమత్తమైన పోలీస్ అధికారులు. భారీ వర్షాలకు ఉదృతంగా పారుతున్న మంజీరా, వాగులు పోతంగల్ మండలంలోని కోడిచెర్ల, మరియు సిర్పూర్ శివారు మధ్యలో పారుతున్న వాగులో నలుగురు చిక్కుకున్నారని ఎస్ఐ సునీల్ కు బుధవారం ఫోన్ రావడంతో స్పందించి వెంటనే సీఐ కృష్ణ కు సమాచారం అందించడంతో ఇద్దరు కలిసి మంజీరా లో డ్రోన్ వీడియో తీయించారు.
వీడియో తీసిన అనంతరం అక్కడ ఎవ్వరు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మంజీరా పరివాహక ప్రాంతాలలో వరద నీరు ఎక్కువ కావడంతో పశువుల కాపరులు, రైతులు ఎవరు కూడా పొలాల వద్దకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
వాగులు పొంగి రోడ్లపై నుంచి నీరు ప్రవహిస్తుంది. వాహనదారులు అటువైపు వెళ్లకుండా కూలిపోయే ఇండ్లలో ఎవరు ఉండకుండా గ్రామపంచాయతీ సిబ్బంది చూడాలని సూచించారు. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పోలాలన్నీ నీట మునిగిపోయాయి.
MOST READ :
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి గెటప్ లో వినాయకుడు.. ఎక్కడో తెలుసా..!
-
Amazon : అమెజాన్ స్కాలర్‌షిప్‌తో తెలంగాణ యువతి విజయం.. మరో 500 మందికి ఆర్థిక చేయూత..!
-
National Award : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణ నుంచి ఎంపికైన మారం పవిత్ర.. ఎవరో తెలుసా..!
-
School Building : నిధులు లేవు.. గదులు లేవు.. చదువులు సాగేదెలా..!









