Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణ

LMD : కరీంనగర్ ఎల్ఎండి 2 గేట్ల ఎత్తివేత..!

LMD : కరీంనగర్ ఎల్ఎండి 2 గేట్ల ఎత్తివేత..!

కరీంనగర్, మన సాక్షి :

కరీంనగర్ లోయర్ మానేరు జలాశయానికి సుమారు 8 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండడం, ఇప్పటికే 24.034 టీఎంసీల కెపాసిటీ గల డ్యామ్ నీటిమట్టం 23.516కు చేరుకోవడంతో మంగళవారం సాయంత్రం రెండు గేట్లు ఒక అడుగు మేర ఎత్తి 4000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

నీటి విడుదల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సిపి గౌస్ ఆలంతో కలిసి ప్రారంభించారు. ముందుగా పూజ కార్యక్రమం ప్రారంభించి స్విచ్ ఆన్ చేసి నీటి విడుదలను ప్రారంభించారు. అనంతరం మీడియతో మాట్లాడుతూ..

రాష్ట్రంలో వచ్చే ఏడాది సాగు, తాగునీటి కొరత లేదని మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఎగువ నుంచి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రెండు గేట్లు తెరిచి నాలుగు వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పంటలు సమృద్ధిగా పండి రైతులు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఎల్ఎండి 920 అడుగుల నీటిమట్టానికి గాను 919.40 అడుగులకు చేరింది. మొత్తం 7642 ఇన్ ఫ్లో వస్తుండగా స్పిల్ వే ద్వారా 4 వేల క్యూసెక్కులు, కాకతీయ కెనాల్ కు ఐదువేల క్యూసెక్కులు నీటి విడుదల చేస్తున్నారు.

MOST READ : 

  1. RDO : సంగారెడ్డి ఆర్టీవో ఆకస్మిక బదిలీ.. ఎందుకో తెలుసా..!

  2. Open School : ఓపెన్ స్కూల్ దరఖాస్తు గడువు పెంపు..!

  3. Suryapet : సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ గా సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.. ఎవరో తెలుసా..!

  4. District collector : డిఈఓ పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. ఆ డిప్యూటేషన్ వెంటనే రద్దు చేయలని ఆదేశం..!

మరిన్ని వార్తలు