Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఎన్నికల ఫలితాల ప్రకటనలో ఆలస్యం చేయొద్దు..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఎన్నికల ఫలితాల ప్రకటనలో ఆలస్యం చేయొద్దు..!

నల్లగొండ, మన సాక్షి.

మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం నల్గొండ జిల్లా, దేవరకొండ డివిజన్ పరిధిలోని దేవరకొండ మండలం, తాటికల్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. పోలింగ్ కోసం చేసిన ఏర్పాట్లు, బ్యారికేడింగ్,ఓటింగ్ కంపార్ట్మెంట్లు,హెల్ప్ డెస్క్,ఫస్ట్ ఎయిడ్,తదితర ఏర్పాట్లు పరిశీలించి అప్పటివరకు పోలైన ఓట్లు, పోలింగ్ శాతం వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 2 గంటలకు ఎట్టి పరిస్థితులలో ఓట్ల లెక్కింపు ప్రారంభం కావాలని ,ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, కౌంటింగ్ ఏజెంట్లకు ముందే సమాచారం ఇచ్చారా ? అని ఆర్ ఓ ను అడిగి తెలుసుకున్నారు. మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్న అన్ని కౌంటింగ్ కేంద్రాల పరిధిలో నిర్దేశించిన సమయం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కావాలని, సాయంత్రం 5 లేదా 6 గంటల లోపు అన్నిచోట్ల కౌంటింగ్ పూర్తి చేసి ఫలితాలను ప్రకటించాలని డి పి ఓ ను ఆదేశించారు.

ఫలితాల ప్రకటనలో జాప్యం చేయవద్దని ఆర్ ఓ లకుతెలిపారు .సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని చెప్పారు.కౌంటింగ్ కేంద్రంలోకి ఎన్నికల విధులు నిర్వహించే వారు తప్ప ఇతరులెవ్వరిని అనుమతించవద్దని చెప్పారు. కౌంటింగ్, ఫలితాల వెల్లడి, అవసరమైతే రీకౌంటింగ్ నిర్ణయం పూర్తిగా స్టేజ్- 2 ఆర్ ఓ దేనని అన్నారు. కౌంటింగ్ సందర్బంగా ఎక్కడైనా శాంతి భద్రతల సమస్య తలెత్తితే వెంటనే పోలీస్ లకు తెలియజేయాలన్నారు.

కౌంటింగ్ ప్రక్రియ మొత్తం సి సి టి వి ల పర్యవేక్షణలో చేయాలన్నారు. కౌంటింగ్ సరళిని తనతో పాటు,జిల్లా ఎన్నికల పరిశీలకులు, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షించడం జరుగుందన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ,దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి ,జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పీ సీఈవో శ్రీనివాసరావు, దేవరకొండ తహసిల్దార్ ,ఆర్ ఓ లు,తదితరులు ఉన్నారు.

MOST READ 

  1. CM Revanth Reddy : హైదరాబాద్ కు ఐఐఎం మంజూరు చేయండి.. కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్ రెడ్డి..!

  2. TG News : రైతులకు మరో శుభవార్త.. ఎరువుల పంపిణీకి మొబైల్ యాప్, ఇంటి వద్ద నుంచే బుకింగ్..!

  3. TET : తెలంగాణ టెట్ షెడ్యూల్ రిలీజ్.. పరీక్ష తేదీలు ఇవే..!

  4. Local Body Elections : అమ్మా నన్ను ఓటు వేసి దీవించు.. కాళ్లు మొక్కి ఓటు అడుగుతున్న సర్పంచ్ అభ్యర్థి..!

మరిన్ని వార్తలు