Miryalaguda : పేకాట ఆడుతున్న ఇంటిపై పోలీసుల దాడులు.. ఏడుగురు అరెస్టు..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డలో పేకాట ఆడుతున్న ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో పేకాట ఆడుతున్న ఏడు మందిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు

Miryalaguda : పేకాట ఆడుతున్న ఇంటిపై పోలీసుల దాడులు.. ఏడుగురు అరెస్టు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డలో పేకాట ఆడుతున్న ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో పేకాట ఆడుతున్న ఏడు మందిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. మిర్యాలగూడ టూ టౌన్ సిఐ సోమ నరసయ్య తెలిపిన వివరాల ప్రకారం..
నల్లగొండ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో మిర్యాలగూడలోని బంగారిగడ్డ ప్రాంతంలో ఒక నివాస గృహంలో డబ్బులు పెట్టి పేకాట (జూదం) ఆడుతున్నట్లు సమాచారం రాగా మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ సోమ నరసయ్య, ఎస్ఐ రాంబాబు పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి అట్టి జూదరుల ఇంటి పై దాడులు చేశారు. పట్టణానికి చెందిన ఏడుగురు పేకాటరాయులను అరెస్ట్ చేశారు.
అరెస్టు చేసిన వారిలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన షేక్ హుస్సేన్, మహమ్మద్ అజీజ్, షేక్ షఫీ, షేక్ ఇమ్రాన్, మహమ్మద్ బాబా, షేక్ ఇమ్రాన్ అలియాస్ జగదీష్, వేముల ధనుంజయ్ ఉన్నారు. వారి నుండి జూదంలో పెట్టిన నగదు 9,213 రూపాయలు, ఆరు సెల్ఫోన్లు, రెండు మోటార్ సైకిల్ లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తులను పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయ నైనది.
ఈ సంఘటన గురించి జిల్లా ఎస్.పి శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే అట్టి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించినారు. ప్రజలు తమ ప్రాంతాలలో ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లయితే వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కి గాని డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరనైనది.
ఇట్టి రైడ్ లో పాల్గొన్న మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సోమ నరసయ్య, ఎస్ఐ రాంబాబు సిబ్బంది అయిన కానిస్టేబుల్స్ కళ్యాణ్, సమద్, రాజశేఖర్, అఖిల్, ఏడుకొండలు లను మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు అభినందించారు.









