Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా.. ఆ రైతులకు ఏప్రిల్15కు విడుదల..!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం రైతులందరికీ అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతుంది. యాసంగి విడత రైతు భరోసా నిధులను మార్చి 22వ తేదీన మొదటి విడతగా ప్రభుత్వం విడుదల చేసింది.

Rythu Bharosa : రైతు భరోసా.. ఆ రైతులకు ఏప్రిల్15కు విడుదల..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం రైతులందరికీ అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతుంది. యాసంగి విడత రైతు భరోసా నిధులను మార్చి 22వ తేదీన మొదటి విడతగా ప్రభుత్వం విడుదల చేసింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పథకానికి ఎకరానికి రెండు విడతలుగా 12,000 రూపాయలను అందిస్తున్నారు. అందుకుగాను యాసంగి విడత రైతు భరోసా నిధులను మొదటి విడతలో 3690 కోట్ల రూపాయలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 72 లక్షల మంది రైతులకు ఒక్కొక్క ఎకరం చొప్పున 6000 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేశారు.

ఇదిలా ఉండగా రెండవ విడత 2650 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరో వారం రోజుల్లో రెండో విడత రైతులకు ఐదు ఎకరాల వరకు ఉన్నవారికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా కొత్తగా రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్న రైతులకు కూడా రైతు భరోసా పథకం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 82,000 మంది రైతులు కొత్తగా భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాటిలో 62,000 మంది రైతులు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తులు చేసుకున్న వారు ఉన్నారు.

ప్రభుత్వం వారిని గుర్తించి వారికి కూడా రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సహాయం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు గాను ఏప్రిల్ 15 కు కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు నిధులు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం.

SIMILAR NEWS 

మరిన్ని వార్తలు