MGU : ఏంజియూలో భోజనంలో పురుగుల కలకలం.. ఆందోళనలో విద్యార్థులు..!
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో వరుస సంఘటనలతో విద్యార్థుల ఆందోళన చెందుతున్నారు. యూనివర్సిటీ పాలనాధికారులు విద్యార్థులపై చిన్న చూపు చూస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతూ కాలం గడుపుతున్నారు.

MGU : ఏంజియూలో భోజనంలో పురుగుల కలకలం.. ఆందోళనలో విద్యార్థులు..!
నల్గొండ, మన సాక్షి :
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో వరుస సంఘటనలతో విద్యార్థుల ఆందోళన చెందుతున్నారు. యూనివర్సిటీ పాలనాధికారులు విద్యార్థులపై చిన్న చూపు చూస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతూ కాలం గడుపుతున్నారు. తాజాగా సోమవారం యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న భోజనంలో పురుగులు కనిపించడంతో భోజనాన్ని వదిలి ఏబీవీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గత రెండు మూడు నెలలుగా యూనివర్సిటీలో నెలకొని విద్యార్థులకు ఇబ్బందులు ఎదురైనప్పుడు విద్యార్థులు ఆందోళన చేయాల్సి వచ్చింది.
అలాగే అన్నంలో అంబర్ గుట్కా ప్యాకెట్ రావడం అలాగే మెస్ ఫ్రిడ్జ్ లో జర్రి కనిపించడం సైన్స్ కాలేజీ ఫ్రిడ్జిలో కప్పలు దర్శనం ఇవ్వడం వంటి వరుస సంఘటనలపై యూనివర్సిటీ బీసీ నిర్లక్ష్యం వల్లనేనని విద్యార్థులు వాపోతున్నారు సోమవారం అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఫిర్యాదు చేయగా బీసీ నిర్లక్ష్యంగా మాట్లాడినట్లు విద్యార్థులు తెలిపారు. తింటే తినండి లేకపోతే మానుకోరి అని నిర్లక్ష్యంగా మాట్లాడాలని విద్యార్థులు తెలిపారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించి ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని కోరుతున్నారు నిరసన తెలిపిన వారిలో యూనివర్సిటీ ఏబివిపి అధ్యక్షుడు హనుమాన్, అజయ్ సంపత్, సతీష్, విజయ్, వెంకటేష్, సుదీర్, అరవింద్, పృద్వి, సాయి, గోపి ప్రణయ్, తదితరులు పాల్గొన్నారు
ఇవి కూడా చదవండి









