Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయంహైదరాబాద్

Kavitha : కెసిఆర్ మనిషి కాదు.. సంచలన ఆరోపణ చేసిన కవిత..!

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన ఆరోపణ చేశారు. కేసీఆర్ తన తండ్రి అయితే తర్వాత.. కానీ ఆయన నాటి మనిషి కాదని, మారిన మనిషి అని.. ఆయన వెంట గుంట నక్కలు, తోడేళ్లు ఉన్నాయని సంచలన ఆరోపణ చేశారు.

Kavitha : కెసిఆర్ మనిషి కాదు.. సంచలన ఆరోపణ చేసిన కవిత..!

మన సాక్షి, హైదరాబాద్ :

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేనగా (TRS) ప్రకటించారు. ఆవేదికపై ఆమె పార్టీ పేరుతో పాటు జెండా రంగును కూడా ప్రకటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన ఆరోపణ చేశారు. కేసీఆర్ తన తండ్రి అయితే తర్వాత.. కానీ ఆయన నాటి మనిషి కాదని, మారిన మనిషి అని.. ఆయన వెంట గుంట నక్కలు, తోడేళ్లు ఉన్నాయని సంచలన ఆరోపణ చేశారు.

సారు.. బయటికి రారు.. అంటూ మరో ఆరోపణ చేశారు. హైదరాబాదులో హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూల్చుతుంటే ఆయన బయటికి రారు. ఖమ్మం జిల్లాలో పేదల ఇండ్లు కూల్చినా ఆయన బయటికి రారు.. రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు సంభవించినా ఆయన బయటికి రారు అంటూ ఆరోపణలు చేశారు.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సరిగా పాలించలేదని అందుకే సరైన ఫలితాలు రాలేదన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు తీరని అన్యాయం జరిగిందని ఆమె పేర్కొన్నారు. బీఆర్ఎస్ లో అమ్మతనం పోయింది. మమకారం పోయింది. ఆయన మన కేసీఆర్ కాదు.. ఆయన మారిన కేసీఆర్ అంటూ ఆమె ఆరోపించారు.

కాలేశ్వరంలో అవినీతి జరిగిందని నేను చెప్పడం తప్పా..? ఆరోజు కేసీఆర్ తన కొడుకు, తన బిడ్డ అవినీతి చేసినా పార్టీ నుంచి పంపిస్తానని చెప్పారు. ఇప్పుడు పార్టీలో అవినీతి జరిగిందని తను చెప్పినందుకు సస్పెండ్ చేశారని, అవినీతిపరులను తన వెంట పెట్టుకున్నారని కవిత ఆరోపించారు.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు